CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంగ్రెస్ పరిస్థితేంటి?..బీజేపీ మళ్లీ గెలుస్తుందా?

Share it:


 కాంగ్రెస్ పార్టీకి ఏదీ కలిసి రావడం లేదు. ఎన్ని జాకీలు పెట్టినా లేచే పరిస్థితి కనిపించడం లేదు. పార్టీ అధ్యక్షున్ని మార్చినా పెద్దగా ఫలితం కనబడటం లేదు..  గుజరాత్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర ఆ రాష్ట్రం నుంచి మినహాయింపు తీసుకుంది.. పులి మీద పుట్రలా ఆమ్ ఆద్మీ పార్టీ జోరు కొనసాగిస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో బిజెపి ఆయువు పట్టయిన హిందుత్వ నినాదాన్ని తన సొంతానికి వాడుకుంటున్నది. దీనికి తోడు విద్య, వైద్యం అందరికీ అందిస్తామని హామీలు ఇస్తోంది.. గుజరాతీలకు సెంటిమెంట్ అయిన చార్ధామ్ యాత్రను ఉచితంగా చేపట్టే అవకాశం కల్పిస్తామని చెబుతోంది.. ఇదే దశలో అధికార బిజెపి కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది.

. నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు.. ఇప్పటికే సుమారు లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.. గుజరాత్ రాష్ట్రాన్ని నేనే నిర్మించానని చెప్పుకొస్తున్నారు.  rahul gandhi, modi, arvind kejriwal  ఇదీ గుజరాత్ ముఖచిత్రం  గుజరాత్ జనాభా ఆరున్నర కోట్లు. మొత్తం 182 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సౌరాష్ట్ర అత్యంత కీలకం.. ఈ ప్రాంతంలో మొత్తం 48 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర అసెంబ్లీలో 40 శాతం సీట్లు ఇక్కడే ఉన్నాయి.

 2017 ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ 28 స్థానాలు గెలుచుకుంది.. కానీ మిగతా ప్రాంతంలో దెబ్బతిన్నది.. బిజెపిని మాత్రం 99 స్థానాలకు మాత్రమే పరిమితం చేసింది. అప్పట్లో పాటిదార్ ఉద్యమం ఉవ్వెత్తున సాగడంతో బిజెపి ఒకరకంగా చెప్పాలంటే చాలా ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. 2017 ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాలపై దృష్టి సారించింది..

 యువతరాన్ని ఆకర్షిస్తోంది. ఈ పరిణామం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. అంతిమంగా భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చుతుందని వారు విశ్లేషిస్తున్నారు.    Gujarat Elections 2022  అప్పుడు ఏడు సీట్లు ఎక్కువ  2017లో గుజరాత్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిజెపి మ్యాజిక్ మార్క్ అయిన 92 సీట్లకు కేవలం ఏడు సీట్లు మాత్రమే ఎక్కువ సాధించింది.. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ పాటిదారులు, ఓబిసి వర్గాల్లో సాధించిన పట్టే.. అప్పట్లో ఒక దశలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అంచనాలు వెలువడ్డాయి.. అయితే మోడీ, షా తన చాకచక్యంతో పరిస్థితి మొత్తం మార్చేశారు. అప్పట్లో కాంగ్రెస్ కొంచెం పుంజుకుంటే గుజరాత్ తన ఖాతాలో పడేది.. కానీ అప్పుడు గెలుపు ముంగిట ఆగిపోయింది.. ఈసారి అధికార బీజేపీకి పెద్ద నెగెటివిటీ కూడా కనిపించడం లేదు. అసెంబ్లీ సర్వేలు చెబుతున్నట్టుగా మరోసారి గుజరాత్ పోరు ఏకపక్షం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Share it:

NATIONAL;

Post A Comment: