CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిన్నారి పై కుక్కల దాడి....

Share it:

 


చిన్నారి పై కుక్కల దాడి....

-తీవ్రంగా గాయపడిన చిన్నారి.

-వైద్య ఖర్చులకు దాతల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు.

-ఇంత జరుగుతున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు. 

మన్యం న్యూస్, మణుగూరు: అభం శుభం తెలియని ఓ పసిపాప పై కుక్కలు విరుచుకుపడ్డాయి. తన ఇంట్లో ఉయ్యాలలో ఉన్న చిన్నారిపై దాడి చేసి తీవ్ర గాయాలపాలు చేశాయి. ఈ సంఘటన మణుగూరు మున్సిపాలిటీలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా   

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోగల చాపల మార్కెట్ ఏరియా స్నేహ గార్డెన్ సమీపంలో నివాసం ఉంటున్న జెర్రిపోతుల అనిత, శ్రీను దంపతుల  5 నెలల కుమార్తెను ఉయ్యాలలో పడుకోబెట్టి తన పని లో నిమగ్నమై ఉండగా, పడుకోబెట్టిన పాపను కుక్కలు ఇంట్లోకి వచ్చి దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడి వల్ల పాప తీవ్ర గాయాల పాలయింది. వెంటనే పాపను ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అసలే నిరుపేద కుటుంభం కావడంతో పాప వైద్యానికి అయ్యే ఖర్చులకు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో  కుక్కలు స్వైర విహారం చేసి అనేక మందిని  గాయపరిచిన మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు ఎవరు పిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి...

-భారతీయ జనతా పార్టీ యువ మోర్చా పట్టణ అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి 

మణుగూరు మున్సిపాలిటీ లోని చాపల మార్కెట్, సుందరయ్య నగర్, మణుగూరు, శివలింగపురం, ;పీకె-1 ఇంక్లైన్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కుక్కల బెడద చాలా అధికంగా ఉంది మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా పట్టణ అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి అన్నారు. ఆయన గురువారం మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు కుక్కల బెడదపై సరైన చర్యలు తీసుకొని ప్రజలను కుక్కల బెడదనుండి కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో  సాయి, శివ, రామ్ చరణ్ ,ఈశ్వర్, బన్నీ, ఆరిఫ్, నరసింహ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: