CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి చుక్కెదురు

Share it:


 టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి చుక్కెదురైంది. సీబీఐ చే విచారణ చేయించాలని బీజేపీ పెట్టుకున్న పిటిషన్ ను కొట్టేసింది.  ఈ మేరకు తెలంగాణ హైకోర్టు పలు సూచనలు చేసింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ పై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తునకు సంబంధించి ధర్మాసనం కేసును సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించింది. ఇంకా సిట్ బృందంతో దర్యాప్తు కొనసాగించాలని షరతులు విధించింది. సిట్ చీఫ్ సీవీ ఆనంద్ నేతృత్వంలోనే దర్యాప్తు కొనసాగాలని ఆదేశించింది. కేసు విషయాలు అటు మీడియా, ఇటు రాజకీయ నేతలకు వెల్లడించరాదని కండీషన్స్ పెట్టింది. కేసుకు సంబంధించిన విచారణ నివేదిక ఈనెల 29న కోర్టు ముందుంచాలని సూచించింది. 

కేసును సీబీఐ లేదా ప్రత్యేక బృందంతో విచారణ చేయించాలని బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  TRS MLAs Purchase Case  నిందితులతో బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కేసులో నిందితులైన రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిల బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తు, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవించి బెయిల్ ఇవ్వడానికి ససేమిరా అంది. దీంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఈ కేసులో మరో ఇద్దరు శరత్, ప్రశాంత్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు.  వీరు కేసులో ప్రధానం కావడంతో పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొచ్చిన్ కు చెందిన జగ్గూజీ అనే మరో స్వామిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

తుషార్, జగ్గూజీకి గల సంబంధం, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నందకుమార్ హోటల్ ను జేసీబీలతో కూల్చివేశారు. ఫిల్మ్ నగర్ లోని డెక్కన్ కిచెన్ హోటల్ ను పోలీసుల బందోబస్తు మధ్య తొలగించారు. దీంతో కేసు ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది.    TRS MLAs Purchase Case  బీజేపీ పెట్టుకున్న పిటిషన్ పై వ్యతిరేక నిర్ణయం రావడంతో నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిందితులు తమ పార్టీ వారు కాదని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కావాలనే తమపై దురుద్దేశ పూర్వకంగా కేసులో ఇరికించిందని ఆరోపిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు విచారణలో ఇంకా ఏ విషయాలు వెలుగు చూస్తాయో తెలియడం లేదు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కేసు మరోమారు వివాదాస్పదంగా మారుతోంది. విచారణ విషయాలు బయటకొస్తే ఎవరి భవితవ్యం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

Share it:

TELANGANA

Post A Comment: