CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇరాన్ దేశంలో హిజాబ్ రగడ

Share it:

 


ఇరాన్ దేశంలో హిజాబ్ రగడ చల్లారడం లేదు. ఆ దేశ అధ్యక్షుడు విధించిన నిబంధనలకు నిరసనగా అక్కడి మహిళలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.  చినికి చినికి గాలి వానలా మారిన ఈ గొడవ ఇప్పుడు హింసాత్మకమైంది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు.. ప్రభుత్వం ఏకంగా హిజాబ్ ధరించని మహిళలను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇదే అదునుగా ఆ బృందాలు మహిళలపై అత్యంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నాయి. వారిని శారీరకంగా హింసిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన గొడవల్లో 328 మంది చనిపోయారు.  Iran Hijab Protest 2022  54 రోజులకు చేరుకున్న ఉద్యమం  ఇరాన్ మహిళలు నడిపిస్తున్న హిజాబ్ వ్యతిరేక ఉద్యమం మరింత వేడెక్కింది. ఇస్లాం మత పెద్దలను ఉద్యమకారులు నేరుగా ఎదిరిస్తున్నారు. వారి తలపాగాలను లాగేసి దొరకకుండా మహిళలు పరుగు తీస్తున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 ఇవి సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా నిలిచాయి. రోడ్డుపై ఎదురుపడిన మహిళలను 'హిజాబ్ ధరించండి' అని అడగడమే ఆలస్యం మత గురువులపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు.. 'దేశాన్ని 40 ఏళ్ల పాటు నాశనం చేశారు.. అయినప్పటికీ మీకు బుద్ధి రావడం లేదా? ఇప్పటివరకు చేసింది చాలు. ఇక బ్యాగులు సర్దుకొని కదలండి అంటూ' ముఖం మీద చెప్పేస్తున్నారు. మరి కొంతమంది అయితే 'ఇది మా సొంత విషయం.. మీ సంగతి మీరు చూసుకోండి' కటువుగా బదులిస్తున్నారు. ఇంకొందరు అయితే' నేను ధరించను.. నా ఇష్టం' అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇరాన్లో తప్పనిసరి చేసిన హిజాబ్ ను ధరించలేదనే కారణంతో అరెస్ట్ చేసిన నైతిక పోలీసులు పెట్టిన చిత్రహింసలకు మహ్సా అమీనీ మరణించిన ఘటన మహిళలను మొత్తం రోడ్డెక్కేలా చేసింది. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ దేశంలో నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.    Iran Hijab Protest 2022  ఇస్లాం మత పెద్దలు ప్రశ్నిస్తే  హిజాబ్ ధరించాలని ఇస్లాం మత పెద్దలు యువతులను ప్రశ్నిస్తే వారు ఎదురు తిరుగుతున్నారు. 

' ఈ దేశం మాది.. ఈ శరీరం నాది. హిజాబ్ ధరించాలో లేదో చెప్పే అధికారం నీకు లేదని' ముస్లిం మత పెద్దలను ఎదురిస్తున్నారు. 54 రోజులుగా సాగుతున్న హిజాబ్ వ్యతిరేక పోరులో సుమారు 328 మంది మహిళలు సైన్యం కాల్పుల్లో చనిపోయారు. 14 వేలకు మందికి పైగా ఉద్యమకారులు జైలు పాలయ్యారు. అయితే ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో ముస్లిం దేశమైన ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు మహిళలను మరింత ఘోరంగా అణిచివేస్తున్నారు. జిమ్ లు,పార్కుల్లో మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు గురువారం తాలిబన్లు ప్రకటించారు. గత ఏడాది అధికారాన్ని హస్తగతం చేసుకున్న వారు బాలికలకు మాధ్యమిక, ఉన్నత పాఠశాలలో ప్రవేశాన్ని నిషేధిస్తూ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం తక్షణమే అమల్లోకి వస్తుందని వారు ప్రకటించారు.. మహిళలు పురుషులతో కలిసి పార్కులకు వెళ్లడం, ఈ జాబ్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తాలిబన్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Share it:

WORLD

Post A Comment: