CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమెరికా వీసా: 2023 వేసవికి తగ్గనున్న వెయిటింగ్ పీరియడ్

Share it:



అవకాశాల స్వర్గం, అధునాతన దేశం అమెరికా.. తాను జారీ చేసే వీసాల విషయంలో ఇకనుంచి వేగంగా స్పందించే అవకాశం ఉంది.. వీసాల జారీ ప్రక్రియ లో మరింత స్పీడ్ పెంచాలని ఆ దేశం నిర్ణయం తీసుకుంది..  దరఖాస్తుదారు వీసా కోసం ఎదురుచూసే సమయం లేదా వెయిటింగ్ పీరియడ్ ఇకనుంచి తగ్గబోతోంది. ప్రస్తుతం ఉన్న వెయిటింగ్ పీరియడ్ ను 2023 వేసవి నాటికి మరింత తగ్గిస్తామని అమెరికా దౌత్య అధికారులు చెబుతున్నారు. కోవిడ్ అనంతరం భారత్ నుంచి వీసా దరఖాస్తులు అధికం అయ్యాయి. దీంతో హెచ్ 1 బి, ఎల్ తో పాటు, బీ1, బీ2(బిజినెస్, టూరిస్ట్) వీసాలకు సంబంధించి 450 రోజులుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్ ను ఇటీవల 9 నెలలకు తగ్గించారు.

  US Visa Process  మరింత తగ్గించాలని..  వాస్తవానికి అమెరికాలో చైనా వాళ్ల తర్వాత ఎక్కువ శాతం ఉండేది భారతీయులే. ఇప్పుడు అక్కడ ప్రఖ్యాత కంపెనీలకు వారే సారథ్యం వహిస్తున్నారు. మరీ ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షురాలుగా భారత మూలాలు ఉన్న కమల హరీస్ వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు కోవిడ్ తగ్గు ముఖం పట్టిన అనంతరం వివిధ కంపెనీల కార్యకలాపాలు యధావిధిగా ప్రారంభమయ్యాయి. అయితే వీటి అన్నింటికీ మానవ వనరులు అవసరం కావడంతో అమెరికా భారతీయులకు వీసాలు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నది. పైగా భారతీయుల్లో కష్టించి పనిచేసే నైపుణ్యం ఉండడంతో అమెరికా తన విధి విధానాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.    US Visa Process  భారత్ సామర్ధ్యాన్ని గుర్తించింది  గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, 

అడోబ్ సీఈవో, పెప్సికో సీఈవో, మైక్రోసాఫ్ట్ సీఈవో అందరు కూడా భారతీయులే కావడం.. ప్రస్తుతం జో బైడెన్ ప్రభుత్వంలో కూడా మెజార్టీ శాతం భారతీయులే ఉండడంతో ఈసారి అమెరికా తన నిబంధనలను సడలించింది. ఇందులో భాగంగా ఏడాదికి 12 లక్షల వీసాలు మంజూరు చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది. వచ్చే వేసవి నాటికి కోవిడ్ మునుపటి పరిస్థితులను తీసుకురావడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతోంది. ఇక హెచ్ 1 బి, ఎల్ కేటగిరి వీసాల రెన్యువల్ కోసం చూస్తున్న వారికోసం ఇటీవల లక్ష స్లాట్లు అందుబాటులో ఉంచామని అమెరికా చెబుతోంది. పైగా వివిధ కంపెనీల్లో మానవ వనరుల కొరత ఉండటంతో వాటి ఒత్తిడి మేరకు అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Share it:

WORLD

Post A Comment: