CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెసల సలాడ్‌.. ఒక కప్పు తింటే చాలు.. కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

Share it:


సాయంత్రం అయిందంటే చాలు.. చాలా మంది నూనెతో చేసిన చిరుతిళ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. కొందరు బేకరీ పదార్థాలను తింటుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. వీటిని తింటే ఎలాంటి ప్రయోజనాలు కలగకపోగా.. మనకు కీడు జరుగుతుంది. కనుక సాయంత్రం పూట ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో పెసల సలాడ్ కూడా ఒకటి. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. ఎంతో వేగంగా చేసుకోవచ్చు. పెసల సలాడ్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెసల సలాడ్ తయారీకి కావల్సిన పదార్థాలు.. దానిమ్మ గింజలు – అర కప్పు, ఉడికించిన గుడ్డు – ఒకటి, మొలకెత్తిన పెసలు – పావు కప్పు. పెసల సలాడ్‌ను తయారు చేసే విధానం.. ఒక గిన్నెలో దానిమ్మ గింజలు, మొలకెత్తిన పెసలను కలుపుకోవాలి. వీటికి ఉడికించిన గుడ్డు తోడయితే శక్తివంతమైన సలాడ్ రెడీ అవుతుంది. కోడిగుడ్డును ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసి బాగా కలపాలి. దీంతో సలాడ్ రెడీ అవుతుంది. దీన్ని రోజూ సాయంత్రం సమయంలో తినవచ్చు. లేదా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో కలిపి అయినా సరే తినవచ్చు. దీంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. పెసల సలాడ్‌ను తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. కొవ్వు మొత్తం కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. అలాగే రక్తనాళాలు శుభ్రంగా మారుతాయి. కనుక హార్ట్ ఎటాక్‌లు వంటివి రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సలాడ్‌ను తింటే శరీరానికి శక్తి లభిస్తుంది. ప్రోటీన్లను పొందవచ్చు. దీంతో కండరాలు దృఢంగా మారుతాయి. అలాగే విటమిన్ ఎ, సి, డి లు లభిస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులను రాకుండా చూస్తాయి. కనుక ఈ పెసల సలాడ్‌ను రోజూ తినాల్సి ఉంటుంది. దీంతో అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.

Share it:

HEALTH

Post A Comment: