CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోరికలు తీరకుండానే కన్నుమూసిన కృష్ణ

Share it:

 


మనిషి ఆశాజీవి. ఎంత సాధించినా సంతృప్తి ఉండదు. ఇంకా ఏదో చేయాలనే తపన చావదు. సూపర్ స్టార్ గా 350కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ ఎన్నో అరుదైన మైలురాళ్లు దాటారు.  గొప్ప గౌరవాలు, బిరుదులు అందుకున్నారు. కీర్తి, సంపద ఆర్జించారు. భిన్నమైన పాత్రలు చేశారు. అయినప్పటికీ కృష్ణగారికి నాలుగు తీరని కోరికలు ఉన్నాయట. అవి నెరవేరకుండానే ఆయన అనంతలోకాలకు పయనమయ్యారు. కృష్ణకు తీరని ఆ నాలుగు కోరికలు ఏమిటో చూద్దాం.  Krishna  కృష్ణకు గూఢచారి 116 గుర్తింపు తెస్తే… మోసగాళ్లకు మోసగాడు ఆయన ఇమేజ్ పతాక స్థాయికి తీసుకెళ్లింది. స్టార్ డమ్ తెచ్చింది.

 ఇవి రెండు హాలీవుడ్ జోనర్స్. ఇండియన్ హీరోలు అసలు టచ్ చేయలేదు. కృష్ణ ఆ సాహసం చేసి విజయం సాధించారు. తన వారసుడు మహేష్ బాబు కూడా కౌబాయ్, జేమ్స్ బాండ్ క్యారెక్టర్స్ చేయాలని ఆయన కోరుకున్నారు. టక్కరి దొంగ మూవీలో మహేష్ కౌబాయ్ రోల్ చేశారు. జేమ్స్ బాండ్ గా మాత్రం నటించలేదు. అయితే నెక్స్ట్ రాజమౌళి మూవీలో మహేష్ రోల్ జేమ్స్ బాండ్ తరహాలోనే ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది.  స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుకి గుర్తింపు తెచ్చిన ఘనత కృష్ణదే. తెలుగువాడైన కారణంగా భారత ప్రభుత్వం అల్లూరి సీతారామరాజును గుర్తించలేదు. అల్లూరి బయోపిక్ చేసి కృష్ణ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఆ విధంగా ఒక వారియర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించి ప్రజలకు చేరువ చేశాడు. కాగా శివాజీ పాత్ర కూడా చేయాలన్నది కృష్ణ కోరిక.

అయితే ఆ అవకాశం కృష్ణకు దక్కలేదు.    Krishna  తన ఇద్దరు కొడుకులు మహేష్-రమేష్ లతో కృష్ణ చేసిన మల్టీస్టారర్స్ అద్బుతమనాలి. కన్న కొడుకులకు అన్నయ్యగా నటించిన ఘనత కూడా ఆయనకే సొంతం. మహేష్,రమేష్ లతో కృష్ణ చేసిన చిత్రాలు చాలా వరకు ఆదరణ దక్కించుకున్నాయి. ముఖ్యంగా మహేష్ చిన్న వయసులోనే స్టార్ అనిపించుకున్నారు. కుమారులతో నటించిన కృష్ణకు మనవడు గౌతమ్ తో నటించాలనే ఆశ ఉంది. వన్ నేనొక్కడినే మూవీలో గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. గౌతమ్ తో నటించాలన్న కోరిక కూడా కృష్ణకు తీరలేదు.  అమితాబ్ హోస్ట్ గా ప్రసారమయ్యే కోన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షో అంటే కృష్ణకు చాలా ఇష్టమట. అమితాబ్ వలె కంచు కంఠం, వాక్చాతుర్యం కలిగిన కృష్ణ అలాంటి షోకి హోస్ట్ గా చేయాలి అనుకున్నారట. బుల్లితెరపై వ్యాఖ్యాతగా కనిపించాలనేది కృష్ణ కోరికట. చాలా కాలంగా కృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమాల్లో నుండి రిటైర్ అయ్యాక కృష్ణ ఇంటికే పరిమితమయ్యారు. హోస్టింగ్ కోరిక కూడా తీరలేదు.

Share it:

CINEMA

Post A Comment: