CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాశ్మీర్లో రక్తపుటేర్లు పారిస్తున్న ఉగ్రవాదులు

Share it:

 


ఇటీవల కాశ్మీర్ ఫైల్స్ అనే చిత్రం వచ్చినప్పుడు మనదేశంలో ఉదారవాదులు రెచ్చిపోయారు. అసలు కాశ్మీర్లో అలాంటి పరిస్థితి లేదని నొసలు చిట్లించారు.  వారిని కాశ్మీర్ తీసుకుపోతే ఎలా స్పందిస్తారో చూడాలి.. ఎందుకంటే ఆర్టికల్ 370 ఎత్తివేసిన తర్వాత కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.. డిసెంబర్లో జి20 సమ్మిట్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో ఉగ్రవాదులు అందమైన కాశ్మీర్లో రక్తపు టేరులు ప్రవహింపచేస్తున్నారు. చైనా, పాకిస్తాన్ మన దేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్న వేళ ఉగ్రవాదులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.  హిందువులను చంపుతున్నారు  రెండు దశాబ్దాల క్రితం కాశ్మీర్లో హిందువులే టార్గెట్ గా ఉగ్రవాదులు సాగించిన ధమనకాండను మనం చూసాం. 

ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే తీసుకురావాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హిందువుల ఇళ్లను కొల్లగొట్టి, వాటిని కూల్చేస్తున్నారు. హిందువులు వెక్కివెక్కి ఏడుస్తున్నారు.. దుఃఖంతో కనీసం ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు.. ఉగ్రవాదులను కట్టడి చేయడంలో ఇరుగుపొరుగు వారిపై పెట్టుకున్న నమ్మకం కూడా ఆవిరైపోతుంది.. దక్షిణ కాశ్మీర్లోని వన్పోహ్ గ్రామస్థురాలు సారిక జీవితాన్ని కాశ్మీర్లో హిందువుల దయనీస్థితికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.. 90వ దశకంలో ఉగ్రవాదుల హింసకాండ కు భయపడిన లక్షలాది మంది హిందువులు కాశ్మీర్ వదిలిపెట్టి పోయారు. కానీ సారిక కుటుంబం స్వగ్రామంలో ఉండాలని నిర్ణయించుకుంది.. ఇరుగుపొరుగు వారిని నమ్ముకుని అక్కడే ఉంది. అయితే గత సంవత్సరం ఆమె కుమారుడిని ఉగ్రవాదులు పట్టపగలు హత్య చేశారు.

 ఆ దుఖం నుంచి ఆమె కోల్పోక ముందే ఇంట్లోని వస్తువులను దొంగతనంగా పట్టుకెళ్ళిపోయి, ప్రహరీ గోడని సైతం కూల్చేశారు. ఈ నేపథ్యంలో సారిక, ఆమె మేనల్లుడు వచ్చి ఆ ఇంటిని చూసి భోరున విలపించారు.  నరకం చూపిస్తున్నారు  మోడీ ప్రభుత్వం వచ్చాక కాశ్మీర్లో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదులకు నిధులు అందడం ఆగిపోయింది. పైగా కాశ్మీర్పై అజిత్ దోవల్ ప్రత్యేక దృష్టిసారించడంతో ఉగ్రవాదుల ఆటలు ఒకప్పటిలా సాగడం లేదు.. ఇది తోడు ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఉగ్రవాదులకు ఊపిరి సలపనంత పని అయింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు గతంలో మాదిరి దాడులకు పాల్పడుతున్నారు. వారికి నరకం చూపిస్తున్నారు. పరిముఖ్యంగా కాశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదలైన నాటి నుంచి దాడులను మరింత ఉద్ధృతం చేశారు. అయితే ఉగ్రవాదులను ఏరి వేసేందుకు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి.

Share it:

NATIONAL

Post A Comment: