CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వారధి కట్టించిన సారధి అసాధ్యుడు అభివృద్ధి ఆశయసాధకుడు

Share it:


  • వారధి కట్టించిన సారధి 
  • అసాధ్యుడు అభివృద్ధి ఆశయసాధకుడు  
  • ; గెలిచిన నాటినుంచి గుండాల ఆళ్ల పల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి
  • ; నిధులు కేటాయిస్తూ ప్రజా ప్రతినిధులను ప్రోత్సహిస్తూ దూసుకుపోతున్న  రేగా 
  • ఎమ్మెల్యే రేగ కాంతారావు ఆదేశాలతో వంతెనలను పూర్తి చేసిన అధికారులు


మన్యం న్యూస్, గుండాల, నవంబర్ 11 అభివృద్ధిఆశయసాధకుడు అలుపెరగని పరిపాలన దక్షకుడు ఈ సారు..  గెలిచిన నాటినుంచి గుండాల ఆళ్ల పల్లి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పథంలో ముందుకెళ్లేందుకు తన వంతు బాధ్యతను పోషిస్తున్నారు. గుండాల ఆళ్ల పల్లి మండలాలకు నిధులు కేటాయిస్తూ ప్రజా ప్రతినిధులను ప్రోత్సహిస్తూ  తనదైన శైలిలో దూసుకుపోతున్న పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. గతంలో గుండాల మండలం లో రహదారుల పరిస్థితి దుర్భరంగా ఉండేది. ఏ గ్రామానికి వెళ్లాలన్న మోకాళ్ళ లోతు బురద తో రహదారులు దర్శనమిచ్చేవి. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాటినుంచి రెండు మండలాలపై ప్రత్యేక దృష్టిసారించి నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో మొత్తం గిరిజన గ్రామాలే ఉన్నాయి వాటి చుట్టూ  కిన్నెరసాని , మల్లన్న వాగు , ఏడు మెలికల వాగు , దున్నపోతుల వాగు , జల్లేరు వాగు ప్రవహిస్తూ ఉంటాయి, వర్షాకాలం  వచ్చిందంటే ఈ వాగు లన్ని ప్రవాహానికి మించి ప్రవహిస్తూ ఉంటాయి. ప్రజలు   నిత్యావసర వస్తువుల కోసం ఈ వాగుల పై ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. 


వాగులు ప్రవాహానికి మించి ప్రవహించే  సమయంలో  దాటలేక గర్భిణిలు  నరక యాతన పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గర్భిణీలు వర్షాకాలం వచ్చిందంటే చాలు గుండెల్లో దడ పుట్టేది .కొందరు వాగుల ప్రవాహం లేని గ్రామాల్లో వారి బంధువుల ఇంటి వద్ద ఉండి వైద్య సౌకర్యం పొందేవారు. వాగులు ప్రవహించే సమయములో అంబులెన్సులు సైతం దాటక వైద్యం అందక కొందరు మృత్యువాత పడ్డ రోజులు కూడా గతంలో నెలకొన్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ పూర్తి భిన్నంగా రెండు మండలాల్లోని రహదారులు అందుబాటులోకి వచ్చాయి మొత్తం  వంతెనలు పూర్తి కావడంతో గిరిజనుల్లో  ఆనందోత్సవాలు కనబడుతున్నాయి కిన్నెరసాని మల్లన్న వాగు దున్నపోతుల వాగు జల్లేరు వాగు లపై వంతెన లన్నీ పూర్తి వి అందుబాటులోకి వచ్చాయి .



అన్ని గ్రామాలకు రహదారులు వేయడంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాకపోకలను సాగిస్తున్నారు. గతంలో ఈ వాగులను గర్భిణీలు దాటాలంటే కుటుంబ సభ్యులు చేతులపై ఎత్తుకొని దాటించి వలసిన పరిస్థితి నెలకొన్నది ఇప్పుడు రెండు మండలాల్లోని అన్ని గ్రామాలకు అంబులెన్స్ వెళ్లే విధంగా రహదారులు పూర్తయ్యాయి. వచ్చే ఏడాదికల్లా మిగిలిన వంతెనల  పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తే రెండు మండలాల్లో పూర్తిస్థాయిలో రవాణా వ్యవస్థ  మెరుగు పడినట్లే ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితోనే  ఇదంతా  సాధ్యమైందని  మండల ప్రజలు అభిప్రాయాలతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: