CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బూర్గంపాడు సర్కార్ దవాఖానాలో సౌలతలు ఫుల్ - ఎమ్మెల్యే రేగా కృషితో అదనపు డాక్టర్ల నియామకం

Share it:



 బూర్గంపాడు సర్కార్ దవాఖానాలో సౌలతలు ఫుల్

 - ఎమ్మెల్యే రేగా కృషితో అదనపు డాక్టర్ల నియామకం

 - అధికమవనున్న ప్రభుత్వ వైద్య సేవలు


బూర్గంపాడు సర్కార్ దవాఖాన ఒక్కొక్కటిగా సకల సౌలతలను తనలో నింపుకుంటూ మండలంలోని 18 గ్రామ పంచాయతీల ప్రజలకే కాక, సమీప మండలాలు, సరిహద్దు ప్రాంతంలోని పొరుగు రాష్ట్రం నుండి అత్యవసర వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగులకు, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంసిద్ధమవుతుంది. 



సారపాక, నవంబర్ 5, మన్యం న్యూస్ : 


మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి దశాబ్దాల చరిత్రను కలిగి, అనేక ఏండ్లుగా పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు నుండి బూర్గంపాడు సమీప మండలాలైన, ప్రస్తుత ఆంధ్ర విలీన మండలాల ప్రజలకు విష జ్వరాలు, ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు అత్యవసర సేవల నిమిత్తం వారికి వైద్య సేవలు అందిస్తూ వచ్చింది ఈ సర్కార్ దవాఖాన. సమీప మండలాల్లో మృతి చెందిన వారికి పోస్టుమార్టం సైతం ఇదే ఆసుపత్రిలో నిర్వహిస్తుంటారు. నేటికి బూర్గంపాడు మండల ప్రజలతో పాటు ఇతర మండలాల నుండి వివిధ అనారోగ్య సమస్యలతో వచ్చే రోగులకు వైద్య సేవలు అందిస్తూ వస్తుంది ఈ పెద్ద ఆసుపత్రి.


 - రేగా కృషితో అదనపు డాక్టర్ల నియామకం


ఇటీవల కాలంలో బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొంటున్న సదుపాయాల కొరత, సిబ్బంది కొరత, ఆసుపత్రికి వచ్చే రోగుల అసౌకర్యాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే జిల్లాలో అమలవుతున్న వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సాధిస్తున్న ఎమ్మెల్యే రేగా కాంతారావు బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలను త్వరితగతిన నివారించేందుకు పాటుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుతోను చర్చించి బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు డాక్టర్లను నియమించేందుకు కృషి చేశారు.  సుదూర ప్రాంతాల నుండి ఆసుపత్రికి వచ్చే రోగులకు భోజన సదుపాయాన్ని సైతం ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలియవస్తుంది. సామాన్య ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక, సర్కారు దవాఖానా వచ్చిన సామాన్యుడికి మెరుగైన వైద్య అందించేందుకు ఎమ్మెల్యే రేగా కాంతారావు చేస్తున్న కృషిని ప్రజలు అభినందిస్తున్నారు.


 - ప్రభుత్వ ఆసుపత్రిలో అధికమవనున్న మెరుగైన వైద్య సేవలు


మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు డాక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది గతంలో  డాక్టర్ నవీన్ కుమార్ (ఆసుపత్రి సూపరిండెంట్), డ్యూటీ డాక్టర్లు డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్, డాక్టర్ అనిత లు సేవలందిస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ శైలేష్ కుమార్, డాక్టర్ జయ, డాక్టర్ శ్రీ వాత్సవ, డాక్టర్ శాంతి ప్రియ, డాక్టర్ సుకన్య రెడ్డి లు బూర్గంపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం లో అదనపు డాక్టర్లుగా నియమితులయ్యారు. ప్రస్తుతం బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 8 మంది డాక్టర్లు వైద్య సేవలు అందిస్తూ ఉండగా వారిలో డాక్టర్ అనిత (దంత వైద్య నిపుణులు),  డాక్టర్ శైలేష్ కుమార్ (ఎముకల వైద్య నిపుణులు), డాక్టర్ జయ (రక్త పరీక్షలు, షుగర్ సంబంధిత సమస్యలు) నిపుణులు ప్రత్యేక సేవలు అందించనున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలోనూ 24 గంటల వైద్య సేవలు అమలులో ఉండగా సేవలు అందించే క్రమంలో సిబ్బంది కొరత వలన పలు సమస్యలు ఎదురయ్యేవి. కాగా ఇప్పుడు అదనపు డ్యూటీ డాక్టర్ల నియామకంతో బూర్గంపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో నిరంతరాయంగా, 24 గంటల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.


రేగా సహకారంతో సామాన్యుడికి సైతం మెరుగైన వైద్య సేవలు

 - టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి.


ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు సహకారంతో సామాన్యుడికి సైతం మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక, నిరంతరాయ వైద్య సేవల కోసం ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.

Share it:

TELANGANA

Post A Comment: