CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

. జి 20 దేశాల శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్లో

Share it:

 


ఇప్పటికే కాశ్మీర్ కు సంబంధించిన స్వయం ప్రతిపత్తి హోదాను రద్దుచేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.  భారతదేశానికి పక్కలో బల్లెంలా మారి ఇబ్బంది పెడుతున్న చైనా, పాకిస్తాన్ దేశాలకు ఒకేసారి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. కాశ్మీర్ మాదే అని పాకిస్తాన్ తన భౌగోళిక చిత్రపటంలో రూపొందించడం, చైనా కూడా దీనికి వంత పాడుతుండడంతో ఇన్నాళ్ళూ ఓపికతో ఉన్న మోదీ ఇప్పుడు తనలో ఉన్న అసలు సిసలైన డిప్లమాటిక్ పర్సనాలిటీని వారికి పరిచయం చేస్తున్నారు. జి 20 దేశాల శిఖరాగ్ర సమావేశం వచ్చే ఏడాది జమ్మూ కాశ్మీర్లోని లడక్ ప్రాంతంలో నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇన్నాళ్లు ఉగ్రవాదుల చెరలో బందీ అయిన సుందరకాశ్మీరాన్ని ప్రపంచ అధినేతలకు చూపించేందుకు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. 

పైగా డ్రాగన్ చేస్తున్న అక్రమాలను ప్రపంచం ముందు ఉంచేందుకు ఆయన కాశ్మీర్లోని లడక్ ప్రాంతాన్ని వేదికగా ఎంపిక చేశారని సమాచారం. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన జీ 20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ్ము కాశ్మీర్ ఆతిథ్యం ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి. భారతదేశంలో తొలిసారిగా 2023లో జి20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సమావేశాలను నిర్వహించేందుకు జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ నుంచి ఇద్దరు నోడల్ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దుచేసి కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అతిపెద్ద సదస్సు ఇదే కావడం గమనార్హం. 

  తొలి సమావేశం ఇదే  ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమూహమైన జి20 సమావేశాలు జరగనున్నాయి. 2019 ఆగస్టులో జమ్మూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 కేంద్రం రద్దుచేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహించే తొలి శిఖరాగ్ర సమావేశం ఇదే.. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన భారత్ కు జి 20 అధ్యక్షత బాధ్యతలు లభిస్తాయి. ఇందులో భాగంగా 2023 నవంబర్ 30 వరకు కూటమికి సంబంధించిన వ్యవహారాలను భారత్ నిర్వహిస్తుంది. వచ్చే ఏడాది నవంబర్ 30 నుంచి డిసెంబర్ ఒకటి వరకు జీ -20 శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది.

 ఈ సదస్సు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, వివిధ విధాన నిర్ణయాల అమలుకు సంబంధించి వెసలు బాటు కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ జి20 సమావేశాలను పాకిస్తాన్, చైనా వ్యతిరేకిస్తున్నాయి. ముందు చైనా ప్రభుత్వం మీడియా కూడా జిమ్ములో నిర్వహించే జి20 సమావేశాల ప్రణాళికను పునః పరిశీలించాలని భారతదేశాన్ని కోరింది. భారతదేశం తీసుకున్న ఏకపక్ష చర్యలు వివాదాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు, ఘర్షణలను ప్రేరేపించేందుకు తోడ్పడతాయని ఆరోపించింది. ఈ సమావేశాలు నిర్వహించడం తమకు వ్యతిరేకంగా ఉందని చైనీస్ కమ్యూనిటీ పార్టీ మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ ఇటీవల వ్యాఖ్యానించింది.    

మిగతా వాళ్ళు ఓకే  ఈ విషయంలో పాకిస్తాన్ ఇంతవరకు నోరు మెదపలేదు. పైగా ఇటీవల కాశ్మీర్లో కార్పొరేట్ కంపెనీలు తమ పెట్టుబడులను ప్రారంభించాయి. ఇక యూరోపియన్ యూనియన్, పంచనూని 19 ఎమర్జింగ్ ఎకనామీ దేశాల నాయకులను ఒకే చోట చేర్చే శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వడం పట్ల మిగతా దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సన్నాహాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, అజిత్ దోవల్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీమంతర ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వ బలగాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు.

Share it:

WORLD

Post A Comment: