CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

'హరి హర వీరమల్లు' లేటెస్ట్ అప్డేట్...10 కోట్ల రూపాయిల బడ్జెట్ తో ఇంటర్వెల్

Share it:


 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వస్తుందంటేనే ఫాన్స్ కి ఒక పండగ లాగ ఉంటుంది.. టాక్ తో సంబంధం లేకుండా బ్రాహ్మరధం పట్టేస్తారు ఫాన్స్..    Ott కాలం లో కూడా ఒక రీమేక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు చెయ్యడం ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే చెల్లింది.. అలాంటి అనితర సాధ్యమైన స్టార్ స్టేటస్ ఉన్న ఒక హీరో పాన్ ఇండియా మూవీ చేస్తే ఎలా ఉంటుంది.. బౌండరీలను దాటి బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయిపోతుంది కదూ!, త్వరలోనే అలాంటి బాక్స్ ఆఫీస్ సునామి ని 'హరి హర వీరమల్లు' అనే సినిమాలు ద్వారా చూడబోతున్నాము.. ప్రముఖ దర్శకుడు క్రిష్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తెరకేక్కిస్తున్నాడు.. ప్రముఖ నిర్మాత AM రత్నం ఈ సినిమాని సుమారు 200 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. ఇటీవలే తాజా షెడ్యూల్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో చిత్రికరణ జరుపుకుంటుంది.      

సినిమాకి ఎంతో కీలకమైన ఇంటర్వెల్ సన్నివేశాన్ని సుమారు 10 కోట్ల రూపాయిల బడ్జెట్ తో రెండు వారాల నుండి షూట్ చేస్తున్నారు.. ఈ షెడ్యూల్ మొత్తం పవన్ కళ్యాణ్ గెడ్డం లుక్ లోనే కనిపిస్తున్నారట.. రీసెంట్ గా కాషాయ వస్త్రం లో గెడ్డం లుక్ తో పవన్ కళ్యాణ్ మీద ఒక ఫైట్ సన్నివేశం ని షూట్ చెయ్యడం ప్రారంభించారు.. ఇది ఫాన్స్ కి రోమాలు నిక్కపొడిచేలా చేస్తుందట.. పవన్ కళ్యాణ్ ఇందులో 3 డిఫరెంట్ లుక్స్ తో 30 రకాల కాస్తుమ్స్ తో కనిపించానున్నారట.      పవన్ కళ్యాణ్ ఇమేజి ని పాన్ ఇండియా లెవెల్ లో చిరస్థాయిగా గుర్తుంచుకునే విధంగా 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని తెరకేక్కిస్తునట్టు సమాచారం.. ఈ చిత్రం లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.. ఇక బాలీవుడ్ పాపులర్ హీరో బాబీ డియోల్ ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు గ్లిమ్స్ వీడియోలు విడుదల అవ్వగా వాటికి ఫాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. డిసెంబర్ 31 వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ టీజర్ ని కూడా విడుదల చెయ్యబోతున్నారట.. సమ్మర్ కానుకగా మార్చి 31 వ తారీఖున ఈ సినిమాని విడుదల చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Share it:
Next
This is the most recent post.
Previous
Older Post

CINEMA

Post A Comment: