CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TWITTER.. సొంత ఉద్యోగులే సంస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు

Share it:

 


ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్(Elon musk) చేతుల్లోకి వెళ్ళాక ట్విట్టర్ రోజూ వార్తల్లో నిలుస్తోంది. ఇన్ని రోజులు సజావుగా సాగిన ట్విట్టర్(Twitter) కార్యకలాపాలు ఇప్పుడు కుదుపులకు లోనవుతున్నాయి.  ఉద్యోగులను తొలగించడం, మూకుమ్మడిగా రాజీనామాలు చేయించడం, సొంత ఉద్యోగులే సంస్థకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వంటి పరిణామాలతో రోజూ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో తమ ఖాతా ఉంటుందో? లేదో? అని యూజర్లు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు తమ పాత ట్వీట్లు, బ్యాకప్ డేటాపై ఆందోళన చెందుతున్నారు. అందువల్ల, ట్విట్టర్ అకౌంట్ యాక్టివిటీ కాపీని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అర్కైవ్‌ డేటా కోసం ట్విట్టర్‌ని అభ్యర్థించడం ద్వారా సులభంగా మీ డేటాను పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా ట్టిట్టర్ మీ బ్యాకప్ డేటా జిప్ ఫైల్‌ను పంపిస్తుంది. దీని కోసం ఈ కింది స్టెప్ట్స్ ఫాలో అవ్వండి.  

* ఫోన్‌ ద్వారా ట్విట్టర్ అర్కైవ్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?  మీ ఫోన్‌లో ట్విట్టర్ యాప్‌ని ఓపెన్ చేసి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీకి వెళ్లండి. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీలోని మీ ఖాతాకు వెళ్లి, 'డౌన్లోడ్ యువర్ డేటా అర్కైవ్‌'పై క్లిక్ చేయండి.  ఇప్పుడు కొత్త బ్రౌజర్ విండో ఓపెన్ అవుతుంది. మీ ట్విట్టర్ ఖాతాకు సైన్ ఇన్ చేసి, రిక్వెస్ట్ అర్కైవ్‌పై క్లిక్ చేయండి.  మీ డేటా డౌన్‌లోడ్ కోసం 24 గంటల సమయం పడుతుందని స్క్రీన్ ​పై కనిపిస్తుంది. డేటా అర్కైవ్‌ డౌన్‌లోడ్ రెడీగా ఉన్నప్పుడు మీ యాప్‌లో నోటిఫికేషన్‌ వస్తుంది. దాన్ని డౌన్ ​లోడ్​ చేసుకోండి.  కాగా, డేటా అర్కైవ్‌ ఆప్షన్ ద్వారా మీరు మీ అకౌంట్ సమాచారం, అకౌంట్ హిస్టరీ, యాప్స్ అండ్ డివైజెస్, అకౌంట్ యాక్టివిటీ, మీ ఆసక్తులు, యాడ్స్ డేటా జిప్ ఫైల్‌ను అభ్యర్థించవచ్చు. మీ డేటా అర్కైవ్‌ డౌన్‌లోడ్ చేసే క్రమంలో మీ ట్విట్టర్ యాప్‌లో నోటిఫికేషన్‌ను పొందవచ్చు.  

డైటింగ్, ఎక్సర్‌సైజులతో పని లేదు..ఈ ఐదు చిట్కాలతో ఈజీగా బరువు తగ్గే అవకాశం..  వెబ్‌సైట్ ద్వారా ట్విట్టర్ అర్కైవ్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?  ముందు ట్విట్ఱర్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. 'మోర్' ఆప్షన్ ​పై క్లిక్ చేసి, ఆ తర్వాత సెట్టింగ్స్ అండ్ సపోర్ట్ ​లోకి వెళ్లి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీపై క్లిక్ చేయండి.  ఇప్పుడు 'యువర్ అకౌంట్'లోకి వెళ్లి, మీ డేటా అర్కైవ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాత మీ ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయమని స్క్రీన్ ​పై కనిపిస్తుంది. అక్కడ యూజర్ మీరేనని ధ్రువీకరించండి. ఆ తర్వాత మీ ఈమెయిల్/ఫోన్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి.. రిక్వెస్ట్ అర్కైవ్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.  24 గంటల తర్వాత మీ డేటా డౌన్‌లోడ్‌కు సిద్దమవుతుందని స్క్రీన్ ​పై చూపిస్తుంది. డేటా సిద్ధమయ్యే వరకు వేచి ఉండండి.

Share it:

TECHNOLOGY

Post A Comment: