CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వన్‌ప్లస్ 10 ప్రోపై భారీ తగ్గింపు

Share it:


   వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ ధరను మనదేశంలో భారీగా తగ్గించారు. దీని ధర ఏకంగా రూ.ఐదు వేలు మేరకు తగ్గింది. వన్‌ప్లస్ 11 లాంచ్ టీజ్ చేసిన కొన్నాళ్లకు దీని ధరను కంపెనీ తగ్గించింది.    కాబట్టి వన్‌ప్లస్ 11 లాంచ్ కూడా త్వరలోనే ఉందనుకోవచ్చు. షావోమీ 12 ప్రోతో వన్‌ప్లస్ 10 ప్రో పోటీ పడనుంది.    వన్‌ప్లస్ 10 ప్రో ధర  ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999 నుంచి రూ.61,999కు తగ్గింది. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.71,999కు తగ్గించారు. వన్‌ప్లస్ 11 స్మార్ట్ ఫోన్‌ను క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ గతంలోనే ప్రకటించింది. 2023 ప్రారంభంలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.    వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు  ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20.1:9గా ఉంది. డైనమిక్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను వన్‌ప్లస్ ఇందులో అందించింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్‌ను కూడా ఇందులో అందించారు.

    క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌పై వన్‌ప్లస్ 10 ప్రో పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.    Reels    ఇక కెమెరాల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్789 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగానూ, మరో 8 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్‌ను కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 కెమెరాను ఇందులో అందించారు. ఈ ఫోన్ 8కే వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.    ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ను, 50W వైర్‌లెస్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 200.5 గ్రాములుగా ఉంది. ఇందులో స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.

Share it:

TECHNOLOGY

Post A Comment: