CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఖర్గే నాయకత్వం లో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత శికరాలకు చేరుకుంటుంది తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి

Share it:


మన్యం న్యూస్, మంగపేట. : అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలలో దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు అవకాశం దక్కడం ఎంతో గర్వకారణం హర్షించ దగ్గ విషయం, అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేసి గెలిపించిన కాంగ్రెస్ నేతలకు, సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డికి, తెలంగాణ మాల మహా నాడు తరపున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నట్లు తెలంగాణ మాల మహా నాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లి కొండ యాదగిరి పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.మంగపేట మండలం రాజుపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దళిత సామజిక వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం దళిత వర్గానికే గర్విం చదగ్గ విషయం 1969 లో న్యాయ వాద వృత్తి నుంచి కాంగ్రెస్ లో  మల్లికార్జున ఖర్గే చేరిక 1972 తొలి సారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ, 1972 నుoచి 2008వరకు వరుసగా 9 సార్లు ఏ మ్మెల్యేగా ఎన్నిక రాష్ట్ర మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా వివిధ హోదాలో సేవలు చేయ టం జరిగిందని 2005 2008 మధ్య కర్ణాటక పిసిసి అధ్యక్షు లుగా బాధ్యతలు 2009 లో తొలిసారి గుల్బర్గా నుంచి లోక్ సభకు ఎన్నిక,2014 లో గుల్ బర్గా నుంచి రెండోసారి విజయం

2014, 2019 మధ్య లోక్ సభ కాంగ్రెస్ ప్రతిపక్ష నేత, 2020 జూన్ లో కర్ణాటక నుంచి రాజ్య సభ ఎన్నిక, 2021 ఫిబ్రవరి 12 నుంచి రాజ్యసభ విపక్షత నేతగా,విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి

సీతారం కేసరి తర్వాత ఏసిసి అధ్యక్షునిగా పదవి చేపడు తున్న రెండో వ్యక్తిగా కర్కే చరిత్రను నిలిచిపోతున్నారని  రిజర్వేషన్ హోదాలో వివిధ అనేక ఉన్నతమైన పదవులను మల్లికార్జున ఖర్గే చేయడం ఎంతో సంతోషంగా గర్వంగా ఉన్నట్లు ఇంకా భవిష్యత్తుతో అనేక ఉన్నతమైన పదవులలో ఉండాలని మాల మహా నాడు తరపున కోరుతున్నట్లు యాదగిరి తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: