CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన ఆశ్రమ పాఠశాలలో వర్కర్స్ ని పర్మినెంట్ చేయాలని డిమాండ్ తో ధర్నా చేపట్టిన కార్మికులు

Share it:


మన్యం న్యూస్, దమ్మపేట, అక్టోబర్ 29 : రాష్ట్ర గిరిజన ఆశ్రమ హై స్కూల్ వర్కర్స్ సంఘం పిలుపుమేరకు దమ్మపేట మండల కేంద్రంలో సహాయ గిరిజన అభివృధి అధికారి కార్యాలయం ముందు అశ్వరావుపేట, దమ్మపేట మండలాల గిరిజన ఆశ్రమ పాఠశాలల మరియు హాస్టల్ దినసరి ఉద్యోగులు వారి డిమాండ్స్ తో శనివారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న వర్కర్లను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయాలని, సెలవులతో కూడిన మొత్తం 12 నెలల జీతం ఇవ్వాలని, విధి నిర్వహణలో ఏ విధంగా మరణించిన గాని ఆ వర్కర్ యొక్క కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఆరోగ్య బీమా సౌకర్యం మరియు ఆరోగ్యశ్రీ కార్డులను అందించాలని, 2020 కరోనా లాక్ డౌన్ సమయంలో జూన్ నుండి డిసెంబర్ వరకు పెండింగ్ జీతాలు చెల్లించాలని, ప్రభుత్వం ఇస్తానన్న హామీ ప్రకారం 30 శాతం పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలని మరియు టైం స్కేల్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వారి డిమాండ్స్ నెరవేరే అంతవరకు సమ్మె కొనసాగుతుందని అదేవిధంగా ఈ సమస్యలపై ఐటిడిఐ ముందు కూడా ధర్నా చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోడెం బాబురావు ఆశ్రమ హై స్కూల్ కావిడి గుండ్ల, మొడియం నాగేంద్రరావు మద్ది కొండ గిరిజన ఆశ్రమ హై స్కూల్, జెట్టి వెంకటేశ్వరరావు పివి ప్రాజెక్ట్, భూక్య వెంకమ్మ డి గొల్లగూడెం, కే దాసు పార్కుల గండి, కే సుబ్బారావు అంకంపాలెం, కే నాగమణి అశ్వరావుపేట, బి అరుణ సున్నం బట్టి, పి భద్రమ్మ చీపురుగూడెం, వగ్గెల అశ్విని సున్నం బట్టి తదితర గిరిజన ఆశ్రమ హై స్కూల్ వర్కర్స్ పలువురు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: