CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేడు హెడ్ ఆఫీస్ ముందు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాను జయప్రదం చేయండి.. సి ఐ టి యు

Share it:


మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17...సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు పెరిగిన డిఏ ప్రకారం చెల్లించాల్సిన 17 నెలల ఏరియర్స్ ను తక్షణమే చెల్లించాలని, 2020 ఏప్రిల్ నుంచి అప్డేట్ చేసి వడ్డీతో సహా కాంట్రాక్ట్ కార్మికుల ఖాతాలలో సీఎం పిఎఫ్ డబ్బులను జమ చేసిన వాటి వివరాలు తక్షణమే తెలియజేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం 4గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద జరిగే కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య పిలుపునిచ్చారు. సోమవారం  కార్పొరేట్ లోని సెంట్రల్ వర్క్ షాప్ వద్ద కాంట్రాక్టు కార్మికుల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ దసరాకు ముందు ఏరియార్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల సకాలంలో కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు గాని ఏరియర్స్ కానీ చెల్లించలేదని ఇప్పటికైనా దీపావళి పండుగ లోపల కాంట్రాక్ట్ కార్మికుల రావలసిన ఏరియర్స్ ను తక్షణమే చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాంట్రాక్ట్ కార్మికుల వద్ద నుంచి ప్రతినెల వేతనాల లో సీఎం పీఎఫ్ కోసం కటింగ్ చేసిన డబ్బులను తక్షణమే వారి సీఎం పిఎఫ్ ఖాతాలలో జమ చేసి వడ్డీతో సహా వివరాలను తెలియజేయాలని డిమాండ్ చేశారు.సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యంతో అయిన ఒప్పందంలోని అంశాలను తక్షణమే సర్క్యులర్సను విడుదల చేసి అమలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యల పరిష్కారానికి  కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి శ్రీనివాస్, సంపత్, రాజు, సరోజ, నాగరాజు, రమ, బిక్కు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: