CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఏవి రంగనాథ్ జన్మదిన వేడుకలు

Share it:


మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , అక్టోబర్ 22 : .... తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం పట్టణంలో అడిషనల్ డీజీ ఏవి రంగనాథ్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా టైక్వాండో  అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్  ఇ.మొగిలి ఆధ్వర్యంలో   కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో, రైల్వే స్టేషన్లలో ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడు కొత్తగూడెంలో డీఎస్పీగా చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్పీగా పనిచేసిన  రోజులలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టైక్వాండో అసోసియేషన్ క్రీడాకారులకు ఎంతో కృషి చేశారన్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మారుమూల గిరిజన గ్రామాల క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నారని అన్నారు. అదే విధంగా టైక్వాండో లో అత్యంత ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా ఆర్థిక సహాయం అందించి విద్యార్థిని విద్యార్థులు ముందుకు నడిపిన మహోన్నతమైన వ్యక్తి అన్నారు.   ఈ  కార్యక్రమంలో  జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ పూసల కృష్ణారావు, రాజయ్య జిల్లా అథ్లెటిక్స్  అసోసియేషన్ కే మహీధర్, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రెటరీ కాశీ హుస్సేన్, జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ వి మల్లేష్ ,జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ రాజేందర్ ,జిల్లా కరాటే అసోసియేషన్ సెక్రెటరీ పెనుగొండ సదానందం, జిల్లా కమిటీ సభ్యులు ఆవుల వెంకట కోటేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: