CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధే లక్ష్యంగా రేగా అడుగులు - కెసిఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష

Share it:


 అభివృద్ధే లక్ష్యంగా రేగా అడుగులు

 - కెసిఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష

- జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత


సారపాక, మన్యం న్యూస్, అక్టోబర్ 29 : 


పినపాక నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు అడుగులు వేస్తున్నారని జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పేర్కొన్నారు. శనివారం సారపాక గ్రామంలోని ఒడియా క్యాంప్, సాయిబాబు గుడి ఏరియాల్లో 5వ రోజు అనునిత్యం ప్రజల కోసమే కార్యక్రమాన్ని జెడ్పిటిసి కొనసాగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పిటిసి కాలనీల్లోని పురవీధుల్లో కాలినడకన పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను స్థానికులు జెడ్పిటిసి దృష్టికి తీసుకువచ్చారు. సదరు సమస్యలను ఎమ్మెల్యే రేగా కాంతారావు సహకారంతో త్వరితగతిన పరిష్కరిస్తామని స్థానిక ప్రజలకు ఆమె భరోసా కల్పించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆమె అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుపరుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు నిరుపేదలకు ఎంతగానో ఆసరాగా నిలుస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. సంక్షోభంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేసిన మహానేత కెసిఆర్ అని గుర్తు చేశారు. ప్రజల నేత అయినా కెసిఆర్ పాలన రాష్ట్రానికి, దేశానికి శ్రీరామరక్ష అని జెడ్పిటిసి పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రజాప్రతినిధులే తెలుసుకొని, పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు అనునిత్యం ప్రజల కోసమే అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆమె వెల్లడించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని జెడ్పిటిసి పేర్కొన్నారు.  నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు అడుగులు వేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులను ప్రత్యేకంగా విడుదల చేయించి, అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సారపాక టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి తిరుపతి, ఏసోబు, పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచందర్, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మీ చైతన్య రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూక్య చిరంజీవి, పార్టీ నాయకులు బెజ్జంకి కనకాచారి, మాజీ ఎంపీటీసీ బిక్షపతి, మండల మైనార్టీ ప్రధాన కార్యదర్శి గుల్ మహమ్మద్, నక్క రమాదేవి, కర్రీ నాగ, అరుణ్ ప్రసాద్, పంగి సురేష్, నాగ్ సురేష్, సుది పాక ఈశ్వరరావు, దార నరసింహారావు, రెడ్డిపోగు రవి, ధారా వెంకట రాములు, యువజన నాయకులు దాసరి మోహన్, భూక్య కృష్ణ, ముడ్ మని, ములకలపల్లి ప్రసాద్, రాయల నాగేంద్ర, జీనుగు దాసు, గోడ్ల రాజు, నాగ్ రవి, ఫోటోగ్రాఫర్ సురేష్, సోను, చేలకాని శివరామకృష్ణ, చింత పృద్వి, ప్రేమ్, రాజేష్ నాగ్, సందీప్, వెంకటేశ్వర్లు, వరప్రసాద్, ఏసు చింటూ, డానియల్, మహేష్, నారాయణ, అజయ్, వేణు, రాజేష్, జానీ, మహేష్, బలరాం, ఆకాష్, మహేష్, రమేష్, సందీప్, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: