CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐటీసీ సేవలు మరువలేనివని - జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

Share it:



సారపాక, అక్టోబర్ 28, మన్యం న్యూస్, :

స్థానిక గ్రామాల్లో ఐటిసి స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలు మరువలేనివి జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండలం కోయగూడెం గ్రామపంచాయతీ పరిధిలో అంగన్వాడి భవనానికి ఐటీసీ వారి సౌజన్యంతో నిర్మించ తలపెట్టిన నూతన ప్రహరీ గోడ, బేబీ టాయిలెట్, వాష్ స్టేషన్ కొరకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐటిసి చీప్ మేనేజర్ చెంగల్ రావు మాట్లాడుతూ... పాఠశాలలలో, అంగన్వాడీలలో మౌలిక వసతుల రూపకల్పనకు ఐటీసీ  ఎప్పుడూ ముందు ఉంటుందని, నేటి బాలలే రేపటి పౌరులని వారి విద్యాభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దామని తెలియజేశారు. అనంతరం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ...స్థానిక గ్రామాల్లో ఐటిసి స్వచ్ఛందంగా అందిస్తున్న సేవలు మరువలేనివి జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత కొనియాడారు. గ్రామపంచాయతీ సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి మాట్లాడుతూ... ఐటిసి ఎం.ఎస్. కే వాష్ ప్రోగ్రాం వారు అంగన్వాడి భవనం నిర్మించారని, ఇప్పుడు అంగన్వాడి నూతన ప్రహరీ గోడ బేబీ టాయిలెట్, వాష్ స్టేషన్ ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పంచాయతీ సిబ్బంది తరపున, గ్రామ ప్రజల తరఫున ఐటిసి ఎం.ఎస్.కే బృందానికి, వాష్ ప్రోగ్రాంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐటిసి ఎం.ఎస్.కే ప్రోగ్రాం మేనేజర్ జయప్రకాష్, ఐటిసి ఎం.ఎస్.కే ప్రోగ్రాం ఆఫీసర్ కృష్ణ, సిడిపిఓ ప్రమీల, మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి షర్మిల, అంగన్వాడీ టీచర్ అనసూర్య, వార్డు మెంబర్లు మాధవి లత, కేశవ కుమార్, జయలక్ష్మి, వెంకటమ్మ, కుమారి, మండల సీనియర్ నాయకులు బెల్లంకొండ రామారావు, పోడియం నాగేంద్ర, తుపాకుల రవికుమార్, వాష్ ప్రోగ్రాం ఏపీవో సునీల్ బాబు, ఇంజనీర్ సుబ్బయ్య, వాస్ టీమ్ మెంబర్స్, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: