CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య.

Share it:


మన్యం న్యూస్ ములుగు

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  ఎస్.కృష్ణ ఆదిత్య   అధికారులకు ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ వివిధ శాఖ అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించారు.ప్రజావాణిలో ధరణి సమస్యలపై 15 దరఖాస్తులు జనరల్ సమస్యలపై 18 దరఖాస్తులు భూమి సమస్యలపై 12 దరఖాస్తులు రాగా మొత్తం దరఖాస్తులు 45 రాగా వాటిని కలెక్టర్ నేరుగా స్వీకరించి సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ ద్వారా మంజూరైన రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు.భారి వర్షాల వల్ల చాలా చోట్ల రోడ్లు ధ్వంసం అయ్యాయని వాటిని మరమ్మత్తులు చేయుటకు ప్రతిపాదనలుపంపించాలన్నారు.చందుపట్ల,కన్నాయిగూడెం,

పలిమెల,మేడారం రోడ్లు నిర్మాణం ప్రతిపాదనలు పంపించాలన్నారు.ములుగు మండల లోని దేవగిరిపట్నం రోడ్డు ప్రతిపాదనలు పంపించి పంచాయతీరాజ్ శాఖ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.రోడ్లపై గుంతలు పడిన చోట్ల మరమ్మత్తులు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు, సైన్ బోర్డులు సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.పశుసంవర్ధక శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని, పశువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయాలని,ఆ శాఖ అధికారిని ఆదేశించారు.వివిధ శాఖల ద్వారా మంజూరైన పనులు త్వరగా పూర్తి  చేయాలని అన్నారు.ఉద్యోగుల అటెండెన్స్ యాప్ ద్వారా  హాజరు నమోదు చేసుకోవాలని ములుగు వెలుగు యాప్ లో హాజరు నమోదు చేసుకొని వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.జిల్లా విద్యాశాఖ అధికారి కి పాఠశాలల తనిఖీ చేయాలన్నారు.మన ఊరు మనబడి పనులపై రిపోర్ట్ ఇవ్వాలని పనులు సమన్వయం చేసుకుంటూ త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఖరీఫ్ పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొనుటకు కార్యచరణ రూపొందిం చాలన్నారు.జిల్లాలో వక్ప్ బోర్డ్ భూముల సర్వే పూర్తి చేసి,రికార్డుల లో నమోదు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు.

ఈ సందర్భంగా గోవిందరావు పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న వినయ్ కుమార్ అనే విద్యార్థి  మద్రాస్ లో  ఐఐటి మెకానిక్ సీటు సాధించడం పై హర్షం వ్యక్తం చేస్తూ వినయ్ కుమార్ను కలెక్టర్ శాలువా మెమొంటో పుష్పగుచ్చంతో సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వై వి గణేష్ డిఆర్ఓ కె రమాదేవి డిపిఓ కె వెంకయ్య సిపిఓ ప్రకాష్ డి డబ్ల్యు ఓ ప్రేమలత డివిహెచ్ఓ విజయభాస్కర్, డిఎస్ఓ అరవింద్ కుమార్ రెడ్డి డిఎం శ్రీరాములు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: