CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి

Share it:


మణుగూరు: విద్యార్థులు చదువుకునే రోజుల్లోనే మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసం కృషి చేయాలని, లక్ష్యం సాధించడం కోసం ఎన్ని కష్టాలనైనా ఆనందంగా అనుభవించిననాడే మంచి ఫలితాలు సాధించగలుగుతారని దానికి తానే ఆదర్శమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎఫ్ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్ అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు నందు ఏర్పాటుచేసిన ఫ్రెషర్స్ డే సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను జీవితంలో ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను తన లక్ష్యానికి అనుగుణంగా సాధించిన విజయాన్ని విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న మణుగూరు డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (డిఎస్పీ) రాఘవేంద్రరావు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనంలోనే మంచి అలవాట్లు ఏర్పాటు చేసుకోవాలని క్రమశిక్షణ కలిగిన జీవన విధానంతో ద్వారానే లక్ష్యాలు సాధించగలమని అందుకు విద్యార్థులు క్రమశిక్షణతో కలిగిన విద్యను అభ్యసించాలని కోరారు. నేటి విద్యార్థులు చెడు వ్యసనాలకు లోనై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉన్నత స్థానానికి చేరుకునే వరకు కష్టపడి చదవాలని కోరారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క సహకారంతో కళాశాల నిరంతరం అభివృద్ధి చెందుతుందని ఇటువంటి ఉన్నతమైన విద్యార్థుల సమ్మేళనమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మణుగూరు అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఆర్టీసీ డిపో మేనేజరు డి శ్రీనివాస్ రావు గారు మరియు అధ్యాపకులు అనిల్ కుమార్, డాక్టర్ అనురాధ, మహ్మద్ కరీం, డాక్టర్ రమేష్ బాబు, జి రామ్ తిరుపతి, పి. భాస్కరరావు, సాంబమూర్తి, అశోక్, నాగిరెడ్డి, జబ్బార్ , సతీష్, శిరీష , బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: