CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మావోయిస్టు ఇలాకలో పర్యటించిన డీజీపీ ఎం మహేందర్ రెడ్డి..

Share it:

 


  • మావోయిస్టు ఇలాకలో పర్యటించిన డీజీపీ ఎం మహేందర్ రెడ్డి.. 
  • తెలంగాణ చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన పూసగుప్ప గ్రామంలో పర్యటన.. 
  • భద్రాది కొత్తగూడెం జిల్లా పోలీసుల పనితీరును మెచ్చుకున్న డిజిపి.. 

మన్యం న్యూస్ చర్ల /దుమ్ముగూడెం ::

తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా చేసే లక్ష్యంగా తెలంగాణ చతిస్గడ్ బోర్డర్ యాంటీ మావోయిస్టు చర్యలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర డిజిపి ఎం మహేందర్ రెడ్డి అన్నారు. చర్ల మండలంలోని పూసుగుప్పలో నూతనంగా నిర్మితమవుతున్న సీఆర్పీఎఫ్ క్యాంప్ ను సందర్శించించిన అయన ముందుగా హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుండి పూసుగుప్పకు చేరుకున్న డీజీపీ జిల్లా ఎస్పీ డా.వినీత్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.డీజీపీతో పాటు అడిషనల్ డీజీ గ్రేహౌండ్స్ కె.శ్రీనివాసరెడ్డి, నార్త్ జోన్ అడిషనల్ డీజీ వై.నాగిరెడ్డి ,ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు లు కూడా ఉన్నారు.మావోయిస్టుల కార్యకలాపాలను నియంత్రించేందుకు తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన పూసుగుప్పలో భద్రతా బలగాల కోసం క్యాంపు నందు నూతనంగా ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు.అనంతరం అక్కడ నిత్యం విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వీలైనంత త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ వారి కార్యకలాపాలను నిరోధిస్తున్న జిల్లా పోలీసుల పనితీరు ప్రశంసనీయం అన్నారు.ఆనంతరం పూసుగుప్ప నుండి హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లా వెంకటాపురం చేరుకుని అక్కడ పోలీస్ స్టేషన్లో భద్రాద్రి కొత్తగూడెం,ములుగు,భూపాలపల్లి,మహబూబాద్ జిల్లాల ఎస్పీలతో పాటు ఇతర పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ,మహబూబ్బాద్ ఎస్పీ శరత్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ,జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ జె.సురేందర్ రెడ్డి,ములుగు ఓఎస్డీ గౌస్ అలాం , కొత్తగూడెం ఓఎస్డీ టి.సాయి మనోహర్,భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ ,ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్ కుమార్ ,ములుగు ఏఎస్పీ సుధీర్ ,ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: