CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొమరం భీమ్ ఉద్యమ ఫలితమే నేటి ఆదివాసిల చట్టాలు.

Share it:


మన్యం న్యూస్ అక్టోబర్ 16 వాజేడు:
 కొమరం భీమ్ 82వ వర్ధంతి వాజేడు మండల కేంద్రంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పిటిసి తల్లడి పుష్పలత, హాజరై కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో జడ్పిటిసి తల్లడి పుష్పలత, మాట్లాడుతూ కొమరం బిమ్ జల్ జమీన్ జంగిల్ అనే నినాదంతో ఆదివాసి గుడాలను ఐక్యతగా చేసుకొని నాటి నైజాం సర్కార్కు పైన ఉద్యమం చేశారు. ఆనాటి ఉద్యమ ఫలితమే  ఆదివాసిలకు చట్టాలుగా అవతరించాయి. కొమరం భీమ్ ఆసియాలు,దృఢ సంకల్పంతో, వ్యూహంతో, పోరాటం చేశారని అన్నారు.కొమరం భీమ్ పోరాట పటిమ ఆదివాసి ప్రజలలో ప్రజ్వలిల్లాలని ఆమె అన్నారు. నేటికీ ఆదివాసి ప్రజలు దీనమైన పరిస్థితులలో బిక్కుబిక్కుమంటున్నారు. అని అన్నారు. ప్రభుత్వాలు ఆదివాసి ప్రజల పక్షాన ఆదివాసి చట్టాలను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ డివిజన్ అధ్యక్షులు సిద్ధబోయిన సర్వేశ్వరరావు మాట్లాడుతూ, త్రుత యుగం నుండి ఆధునిక, కంప్యూటర్ యుగం వరకు, ఆదివాసీలు పోరాటాల ఫలితంగానే జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా అణిచివేయబడ్డారని, అఖండ భారత దేశంలో ఆదివాసీల రాజ్యాలు విరసిల్లేయి,కానీ నేటి ఆధునిక యుగంలో ఆదివాసీల పరిస్థితి అగమ్యో గోష రంగ ఉంది. కొమరం భీం లాంటివారు ఎందరో మహానీయులు,ఉద్యమ యోధులు, ప్రాణాలు సైతం లెక్క చేయక, ఆదివాసీల హక్కుల కొరకు ఉద్యమం చేశారు. ప్రధానంగా  కొమరం భీమ్ ఉద్యమం ఆదివాసి ప్రజలలో నమ్మకం, విశ్వాసం నిండుగా కలిగించారు. జల్ జమీన్ జంగిల్ అనే నినాదంతో నైజాం సర్కారు పైన తిరుగుబాటు చేశారు. ఈ భూమి మనదే, రాజ్యం మనదే, పరిపాలన మనదే , రాజ్యాధికారం ఆదివాసులే చేయాలని మలిదశ ఉద్యమాన్ని ప్రజలకు అందించారు. ఈ ఉద్యమంలో నైజాం సర్కార్ను గడగడలాడించి ఆదివాసులకు హక్కులు కల్పించారు. నాటి ఉద్యమమే నేటి చట్టాలుగా చేశారని అన్నారు. నేటికీ ఆదివాసీ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు, చట్టాలను పటిష్టంగా అమలు చేయవలసిన ప్రభుత్వాలు, ఆవడ దూరంలో పెడుతున్నారు. నేటికీ ఆదివాసీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. ఆదివాసి చట్టాలను ఆదివాసీల హక్కులను రక్షించకుంటే ఆటవిక జాతులు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నారని ఆయన అన్నారు. దాని అర్థం ఆదివాసీలను అంతమొందించడం అంటే, ప్రకృతి విపత్తులు సంభవించినట్లే, ఆదివాసీలు ప్రకృతితో మమేకమై జీవనం కొనసాగిస్తున్నారు.అని ఆయన అన్నారు. ఇకనైనా ఆదివాసీలను ఆదివాసి చట్టాలను కంటికి రెప్పలా రక్షించవలసిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాపురం ఎంపీటీసీ యలం చిట్టిబాబు, సర్పంచుల, పోరం అధ్యక్షులు నరేష్ కుమార్, కొంగల సర్పంచ్, యాలం శివరామకృష్ణంరాజు, గుమ్మడిదొడ్డి, సర్పంచ్ జయలక్ష్మి, తుడుం దెబ్బ నాయకులు జిల్లా కార్యదర్శి పాయం జానకి రమణ, జిల్లా నాయకులు, కుచింటీ చిరంజీవి, జజ్జరి సత్యనారాయణ, తల్లడి నాని బాబు,  ఏవిఎస్పీ జిల్లా అధ్యక్షులు బోదే బోయిన సురేష్, ఆదివాసి అడ్వకేట్ చింత సమ్మయ్య, చింత మధు, వాసం వెంకటేశ్వర్లు, కంబాలపల్లి గణపతి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: