మన్యం న్యూస్ ,పినపాక:
పినపాక మండలం ఈ బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్స్లో కేసు నమోదు చేసినట్లుగా డిఎస్పి రాఘవేంద్రరావు తెలియజేశారు. బుధవారం ఈ బయ్యారం పోలీస్ స్టేషన్లో లో వివరాలు తెలియజేశారు. పినపాక మండలం చింతల బయ్యారం గ్రామానికి చెందిన ఒక యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో తీసుకొని వెళ్ళినందున కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లుగా తెలియజేశారు. సహకరించిన వారిపై సైతం కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. మైనర్ బాలికలను ప్రేమ పేరుతో మోసగించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజగోపాల్, ఎస్సై సూరి పాల్గొన్నారు
Post A Comment: