CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

లైసెన్సులు లేని బాణసంచా దుకాణాలు -లైసెన్స్ లేదు అయినా నా వ్యాపారం నా ఇష్టం అంటున్న దుకాణదారుడు -ఫిర్యాదు చేసిన స్పందించని ప్రభుత్వ అధికారులు.

Share it:

 


మన్యం మనుగడ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండల కేంద్రంలో విచ్చలవిడిగా అనుమతులు లేకుండా బాణసంచా సామాగ్రిని బాహాటంగానే విక్రయిస్తున్నారు, కనీసం బాణసంచా దుకాణాలకు లైసెన్స్ లేకపోయినప్పటికీ నిబంధనల ప్రకారం బాణసంచా దుకాణాలు ఆవాసాలకు ఊరికి దూరంగా ఉండాలి అనే, విషయాన్ని కూడా మర్చిపోయి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దమ్మపేట ప్రధాన సెంటర్లో గల కొన్ని షాపులలో బహిరంగంగానే లైసెన్సు లేకపోయినప్పటికీ మందు గుండు సామాగ్రి దీపావళి టపాసులు తదితర బాణాసంచా సామాగ్రిని విక్రయిస్తున్నారు. మానసంచ సామాగ్రి విక్రయ లైసెన్స్ నిబంధనల ప్రకారం అమ్మకాలు కొనసాగించే షాపులు నివాస స్థలాలు జనావాసాలు జనసంచారం ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి కానీ అట్టి నిబంధనలను పాటించకుండా బహిరంగ మార్కెట్లో అధిక సంఖ్యలో జనాలు తిరిగే ప్రదేశాల్లో అమ్మకాలు కొనసాగించడంపై స్థానికులు అవాక్కవుతున్నారు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని అప్పటికప్పుడు కాపాడటం కూడా చాలా కష్టతరమని ప్రధాన సెంటర్లో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి మానస సామాగ్రికి నిప్పు అంటుకున్నట్లయితే ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఈ విషయంపై తాహసిల్దార్ కు ఫిర్యాదు చేయగా పరిశీలిస్తాం అనే మాట అనడం తప్పితే చర్యలు తీసుకోవడానికి ముందుకు రాలేదు అక్రమంగా బాణసంచా సామాగ్రి అమ్మకాలపై సరియైన సమాచారం ఉన్నప్పటికీ తాహసిల్దార్ చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు అనే విషయం ఫిర్యాదారులకు అర్థం కావట్లేదు కనీసం సంబంధిత ఉన్నతాధికారులైన తక్షణమే స్పందించి నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా సామాగ్రిని అమ్ముతున్న షాపులు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజానీకం కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: