CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు. : ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళను కదిలిస్తుంది ఎంపీపీ రేగా కాళిక

Share it:


మన్యం మనుగడ, కరకగూడెం:కరకగూడెం మండల  ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రజాకవి, భారత స్వతంత్ర సమరయోధుడు,తెలంగాణ ఉద్యమకారుడైన కాళోజి నారాయణరావు 108 వ జయంతి సందర్భంగా స్థానిక ఎంపీపీ రేగా.కాళిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ మన గొడవే నా గొడవ అంటూ కలానికి పదును పెట్టి తన కవిత్వాలతో వేల లక్షల మంది హృదయాలను కదిలించి, న్యాయం కోసం పోరాడినటువంటి మహాకవి మన కాళోజి అని అన్నారు.పుట్టుక చావు అనేది ప్రజల కోసమే అనే గొప్ప సంకల్పంతో అన్యాయం ఎక్కడ ఎదురైనా అది ఆంధ్ర మహాసభలైనా, దేవాలయాలైన,మసీదులైన, రౌండ్ టేబుల్ సమావేశాలైన, వెంటనే అక్కడ వాలిపోయి తన కవిత్వాలతో అధికారులకు దీటుగా సమాధానం చెప్పిన యోధుడు మన కాళోజి అని అన్నారు.తెలంగాణ ప్రజల ఆర్తి ఆవేదన,ఆగ్రహం కాళోజి  కవిత్వాలలో కనిపిస్తుందని,ఆమె అన్నారు. తెలంగాణ వేరైతే దేశానికి అపత్తా తెలంగాణ వేరైతే తెలుగు భాష మారుస్తారా, అంటూ గళమెత్తిన తెలంగాణ ఉద్యమకారి అని దోపిడి చేసే దేశాంతర పొడిని దేశం దాటే దాకా తరిమికొడతాం,దోపిడీ చేసే ప్రాంతపుడిని ప్రాణాలతోనే పాతర వెస్తం.అంటూ తెలంగాణకు దోపిడీ చేసే వాళ్ళ చెంప చెల్లుమనిపించిన దిరోదా తుడు కాళోజి నారాయణరావు అన్నారు.ఎన్ని అవార్డులు బిరుదులు వచ్చినా ప్రజాకవి అనే పదమే నాకు మనశ్శాంతిని ఇస్తుందని పేర్కొన్న గొప్ప వ్యక్తి మన కాళోజీ అని అతని గొప్పదనాన్ని వివరిస్తూ ఆయనని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా అన్యాయాన్ని ఎదిరించి న్యాయం కోసం పోరాడుతూ ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు పోవాలని సూచించారు.ప్రజాకవి దేశం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారుడు, కాళోజి నారాయణరావు  108వ జయంతి ఇంత అద్భుతంగా జరుపుకోవడం ఆదర్శనీయం సంతోషకరమని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రజాపరిషత్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

Post A Comment: