CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ చీరాలు పంపిణీ చేసిన ఎంఎల్ఏ మెచ్చా

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారయణపురం గ్రామంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని అశ్వారావుపేట ఎంఎల్ఏ  మెచ్చా నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సంధర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి ఒక ఆడపడుచు దసర పండుగ నాడు కొత్త చీర కట్టుకుని బతుకమ్మ అడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళను, అక్కా చెల్లెళ్ళుగా భావించి ఈ  చీరలను పంపిణి చేసే ఈ బ్రహొత్తర మైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనీ అలాగే ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిందని, తెరాస ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి ఉండాలని, ఏ రాష్ట్రంలో లేని అభివృద్ది మన రాష్ట్రంలో జరుగుతుందని, ప్రతి పేద కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి ఆశయంఅని. ఈ దసరా పండుగ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30రకాల వెరైటీలు, 240 డిజైన్లు, 800 కలర్ కాంబినేషన్ లతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణి కార్యక్రమం చేపట్టారని ఆయన తెలిపారు. అలాగే అశ్వారావుపేట మండలం లో సుమారు 14480 చీరలను ఇంకా చీరలు వస్తాయని తెలిపారు, అలాగే ఇంకా ఎవరైనా ఆసరా పెన్షన్ రాని వారు ఉంటె మళ్ళీ ధరకాస్తు చేసుకోమని ఈ సంధర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన తో పాటు జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, తెరాస పార్టి మండల అధ్యక్షులు బండి పుల్లారావు, కార్యదర్శి జూజ్జురపు వెంకన్న, సర్పంచుల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్, నారాయణపురం సర్పంచ్ కంగల పరమెష్, ఎంపిటిసి రమేష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ నిర్మల పుల్లారావు, నారయణ పురం రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చిన్నంసెట్టీ వెంకట నరసింహం, ఎంఆర్ఓ చల్లా ప్రసాద్, ఎంపీడిఓ విద్యాధర రావు, ఎంపీఓ సీత రామరాజు, సీఐ బాలకృష్ణ, ఎస్ఐ చల్లా అరుణ, చందా లక్ష్మి నర్సయ్య, మండల నాయకులు మోహన్ రెడ్డి, తాడేపల్లి రవి, ప్రకాష్ మాస్టర్, నులాకాని శ్రీనివాస్, బిర్రంవెంకటేశ్వరరావు, ఆకుల శ్రీను, పసుపులేటి, ఫణీంద్ర,ఆవుల చిన్ని, తుంపాటి రమేష్ మరియు మండల నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: