CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజాపంధా పార్టీ చర్ల మండల నూతన కమిటీ ఎన్నిక. చర్లలో ప్రత్యన్మయ విప్లవ రాజకీయ శక్తిగా ప్రజాపంధా నిలుస్తుంది.

Share it:


మన్యం టీవీ,  చర్ల :

చర్ల మండలంలో  గ్రామాపంచాయతీ  కాంప్లెక్స్ లో సిపిఐ ఏంఎల్  ప్రజాపంధా చర్ల  మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, పార్టీ నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది.. ఈ సమావేశాలకు మండలంలోని పలుగ్రామల ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపిఐ ఏంఎల్  ప్రజాపంధా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి, కెచ్చేలా.రంగారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు ఇల్లందు మాజీ  ఏమ్మెల్యే  గుమ్మడి.నర్సయ్య లు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నారని అన్నారు. ధగాకోరు విధానాలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్నాయని ఈ దొంగ , దోపిడీ దారి ప్రభుత్వాలను ఓడించేంత చైతన్య వంతులుగా ప్రజలు మారాలని అన్నారు. 

ఈ దోపిడీ సమాజాన్ని నిర్ములించి సమసమాజ నిర్మాణమే లక్ష్యం గా పార్టీ పని చేస్తుందని అన్నారు. చర్ల మండలంలో ప్రజల సమస్యల పరిస్కారంకై పోరాటం చేస్తుందని తద్వారా చర్లలో పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. ప్రజాపంధా అభిహృది అవ్వడానికి చర్ల మండలంలో అనేక వనరులు ఉన్నాయని, నీతిగా నిజాయతీగా ప్రజలకోసం పోరాడే పార్టీని ప్రజల ఆదరించాలని అన్నారు.

చర్ల మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి పార్టీ పాటుపడుతుందని అన్నారు.

తాలిపేరు ప్రాజెక్ట్ పై లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించి 24 గిరిజన గ్రామాలలోని 8 వేళా ఎకరాలకు సాగుభూమి కి నీరు ఇవ్వాలి. పొడుభూములకు పట్టాలు ఇవ్వాలి.

అర్హులైనవారికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇవ్వాలి.వలస ఆదివాసీ ప్రజల సమస్యలను పరిస్కారం చెయ్యాలి. చర్ల కేంద్రంగా ఫైర్ స్టేషన్ న్నీ , పీహెచ్  ఆసుపత్రిని, డిగ్రీ కాలేజ్ ని నిర్మించాలి. పోస్టుమార్టం నిర్వాహన అధికారిని నియమించాలి. ఏకలవ్య పాఠశాలని త్వరగా నిర్మించాలని ప్రభుత్వాలని డిమాండ్ చేశారు.

అనంతరం 8 మందితో (కొండా చరణ్ , పాలెం చుక్కన్న, లంకా వెంకట్, ముసలి సతీష్, తన్నీరు లక్ష్మీ, కొండా కౌశిక్, పాముల సాంబ, రేగా ఆంద్రయ్య )నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీ ఏకగ్రావంగా  మండల కార్యదర్శి గా కొండా.చరణ్ న్నీ ఎన్నుకోవడం జరిగింది..  ఎన్నిక అనంతరం గుమ్మడి నరయ్య మాట్లాడు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపి ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి ఈ కమిటీ కృషి చేయాలని, ప్రజల కోసం నిలబడాలని అన్నారు..

ఈ సమావేశంలో ఎం యల్ ప్రజా పందా రాష్ట్ర నాయకులు ముద్దా భిక్షం  జిల్లా నాయకులు రామన్న, కెచ్చేలా కల్పన, గౌస్ పాషా, సాయన్న, మండల నాయకులు కొండా.చరణ్, లంకా వెంకట్, చుక్కన్న,సతీష్,సాంబ, లక్ష్మీ, నాని, కొమరం రాములు, జానకమ్మ్మ, రాజు, శ్యామ్ సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: