CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎం ఎల్ ప్రజాపంధా పార్టీ ఆధ్వర్యంలో స్వయం నిర్భద ఆమరణ నిరాహారదీక్ష...

Share it:

 ◆విధులకు సక్రమంగా హాజరు కానీ చర్ల ఇంచార్జ్ ఎం ఈ ఓ ని తొలగించాలి...

◆చర్ల మండలంకు పరిమినెంట్ ఎం ఈ ఓ ని తక్షణమే నియమించాలి..



◆ఎం ఎల్ ప్రజాపంధా పార్టీ ఆధ్వర్యంలో స్వయం నిర్భద ఆమరణ నిరాహారదీక్ష...

◆సోమవారానికి ఎం ఈ ఓ ని పరిమినెంట్ గా నియమిస్తామని కలెక్టర్ హామి....

◆కలెక్టర్ మాటపై నమ్మకంతో తాత్కాలికంగా పోరాటాన్ని వాయిదా..

◆కలెక్టర్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పోరాటంను మరింత ఉదృతం చేస్తాము.

 సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా పార్టీ 

 

మన్యం టీవీ చర్ల :

చర్ల మండల కేంద్రంలో ఎం ఈ ఓ కార్యాలయం లో ఎం.ఎల్ ప్రజాపంధా పార్టీ ఆధ్వర్యంలో

చర్ల మండలానికి పర్మినెంట్ ఎం ఈ ఓ ను తక్షణమే నియమించాలని స్వయం నిర్బంధ ఆమరణ నిరాహారదీక్ష చేయడం జరిగింది. ఈ సందర్బంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా చర్ల మండల కార్యదర్శి కొండా చరణ్, పార్టీ మండల నాయకులు ముసలి సతీష్ లు  మాట్లాడతూ 6 సంవత్సరాలు గా చర్లలో ఇంచార్జ్ ఎం ఈ ఓ  వ్యవస్థ నడుస్తుందని, ఇంచార్జ్ఎం ఈ ఓ ఒక్కరే 4,5 మండలాలు చేసుకోవాల్సి రావడం వల్ల చర్ల మండలానికి సరైన సమయం ఇవ్వడంలేదు అని అన్నారు.ఎం ఈ ఓ  అందుబాటు లో లేకపోవడం వల్ల ముఖ్యంగా పర్యవేక్షణ లోపం ఉంటుందని, అంటే ప్రతి రోజు ఏదో ఒక బడి సందర్శించి ఉపాధ్యాయుల సమయపాలన, పాఠశాల నిర్వహణ,ఎం డి ఎం పరిశీలించాలని ఎం ఈ ఓ అందుబాటులొ లేకపోవడం తో ఉపాద్యాయులు సమయపాలన పాటించడం లేదు. బోధన సరిగా చేయకపోవడం వల్ల పిల్లలకు చదువురాని పరిస్థితి వచ్చింది.

ఉపాధ్యాయులకు కొన్ని రకాల లీవ్స్, మెడికల్ బిల్లుపై,ఎస్ ఆర్ లో, కొన్ని రకాల ప్రొసీడింగ్స్ పై ఎం ఈ ఓ సంతకం అవరమై ఉన్నయని, మండలంలో ఎం డి ఎం బిల్లుపై ఎం ఈ ఓ సంతకం తోనే ఎస్ టి ఓ కు పంపవలసిన అవసరం వున్నదని, ఇవీ సకాలంలో పంపాలంటే ఎం ఈ ఓ అందుబాటులొ ఉండాలని అన్నారు. పర్యవేక్షణ అధికారి లేనందున చర్ల లో ప్రాథమిక విద్య కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఏజెన్సీ లోని విద్యార్థులు భవిష్యతుని దృష్టిలో పెట్టుకుని ఉన్నత అధికారులు స్పందించి చర్ల పరిమినెంట్ ఎం ఈ ఓ ని నియమించాలని విధులకు సక్రమంగా హాజరుకాలేకపోతున ఇంచార్జ్ ఎం ఈ ఓ ని తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక విద్య భావితరాల బాగు కోసం యంతకైనా తెగిస్తామని తెలిపారు.ఎం ఈ ఓ వచ్చేంతవరకు ఈ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.


 స్పందించిన కలెక్టర్

స్థానిక ఎమ్మార్వో దీక్ష స్థలానికి చేరుకొని సమస్యని అర్ధంచేసుకొని ఫోన్ ధ్వారా జిల్లా కలెక్టర్ తో మాట్లాడగా కలెక్టర్ వచ్చే సోమవారం నాటికి పర్మినెంట్ ఎంఈఓ  ని నియమిస్తామని హామీ ఇవ్వడంతో ఈ దీక్షల పోరాటాన్ని తాత్కాలిక0గా నిలిపివేయడం జరిగింది.

అధికారుల ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Share it:

TELANGANA

Post A Comment: