CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భూపతిరావుపేట గ్రామంలో విశ్వకర్మ భగవాన్ పూజలు

Share it:


మన్యం మనుగడ, పినపాక:



భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపినపాక మండలం భూపాతిరావు పేట గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో విశ్వ సృష్టికర్త విశ్వకర్మ భగవాన్ పూజలు  అత్యంత భక్తి శ్రద్ధలతో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి  హోమం నిర్వహించారు. విశ్వకర్మ దేవతలకు ఆభరణాలు, శిల్పాలు సృష్టించి అందరికి ఆదర్శంగా నిలిచాడని సంఘం నేతలు కొనియాడారు.శ్రీ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం  వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వకర్మ పూజ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్య వహనం, హోమం, నిర్వహించారు. ఈ సందర్భంగా  విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు పోతురాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ ఉత్సవాలు

ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

అనంతరం ఐదు రంగుల జెండా ఎగురవేశారు.

అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు. పోతురాజు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మడపు భాస్కర్, కార్యదర్శి బొడ్డుపల్లి అంజయ్య, కోశాధికారి కోసూరి సుబ్బారావు, సహాయ కార్యదర్శి చిట్యాల అశోక చారి, గౌరవ సలహాదారులు, సింహాద్రి చిన్న సత్యం, తొగటి వీరభద్రాచారి.  కోవెలకుంట్ల రమణాచారి , చిట్యాల మల్లికార్జున చారి, కోసూరి బసవచారి, సింహాద్రి పోతురాజు ,  తొగటి  కుమార్, మడప శ్రీనివాసచారి, అక్కినేపల్లి వీరభోగచారి, నాగోజు శ్రీనివాస్, ఉప్పరపల్లి బ్రహ్మం , సింహాద్రి వీర రాఘవులు, సింహాద్రి సత్తిబాబు, బొల్లెపల్లి త్రివేణి చారి, దినకర్, కల్లూరి రమణ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: