మన్యం మనుగడ వాజేడు సెప్టెంబర్ 17:
విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సర్పంచ్ తల్లడి ఆదినారాయణ జెండా ఆవిష్కరణ చేసి ఆయన మాట్లాడుతూ,విశ్వకర్మ జయంతి అనేది హిందూ దేవుడు, దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ కోసం జరుపుకునే రోజు, అతను స్వయంభుగా, ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడు. అతను కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారక నగరాన్ని , పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించాడు, దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను సృష్టించాడు. అతను దివ్య వడ్రంగి అని కూడా పిలువబడ్డాడనీ చరిత్ర కలిగి ఉంది.ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం అధ్యక్షులు, సనత్ కుమార్, వేల్పూరి శ్రీనివాస్, భాను ప్రకాష్, షణ్ముఖ, చారి వినోద్ కుమార్, రాంబాబు, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: