CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మంగపేట మండలం లో విమోచన దినోత్సవ వేడుకలు

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

నిజాం నిరంకుశం,రజాకార్ల రాక్షసత్వం నుండి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగిన రోజు సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని నేటికీ 74 ఏండ్లు పూర్తి అయ్యి 75 వ ఏటా అడుగిడుతున్న సందర్బంగా నిజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలను ఈ ఏడాది పాటు నిర్వహించాలని ఉత్సవ సమితి నిర్ణయించింది. నిజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల ప్రారంభం రోజున ఉమ్మడి భూపాలపల్లి జిల్లా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కమలాపురంలోని ఆటో సెంటర్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  నిజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల ఉత్సవ సమితి జిల్లా సభ్యులు తోట చిన్నా రావు త్రివర్ణ పతాకం ఎగురవేసారు. జెండా వందనం తరువాత ఏటూరునాగారం ఖండ కార్యవాహా ఇప్పలపెళ్ళి రమేష్ మాట్లాడుతూ నిజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాలు 17 సెప్టెంబరు 2022 నుండి 17 సెప్టెంబర్ 2023 వరకు జరుగుతాయని అన్నారు.

సెప్టెంబర్ 17 రోజున తెలంగాణ ప్రాంతానికి స్వతంత్రం వచ్చిన రోజు, తెలంగాణ ప్రజలకు నిజాం రాజు నుండి విముక్తి కల్గిన రోజు అని తెలియజేశారు.

భారత దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగష్టు 15 వచ్చింది కానీ మన తెలంగాణ కు ఏడాది తరువాత 1948 సెప్టెంబర్ 17న విమోచనఓ లభించింది.నిజాం నిరంకుశం, రజాకార్ల రాక్షసత్వం నుండి మన తెలంగాణ ప్రాంతానికి ఎంతో మంది వీరు పోరాటం, ప్రాణత్యాగం వలన మనకు విముక్తి కల్గింది. నిజాం నిరంకుశత్వాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి తెలియ జేసిన విలేఖరి షోయబుల్లాఖాన్ ని అతి కిరాతకంగా చంపారని ఈ సందర్బంగా వక్తలు అన్నారు.

 తెలంగాణ భగత్ సింగ్ అయిన రావు పవార్,వందేమాతరం విలేఖరి రావు, బత్తిని మొగిలయ్య గౌడ్, కొమరం భీం, రాంజీ గోండు, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ ఇలా అనేక మంది పోరాట యోధులతో పాటు అప్పటి ప్రజలందరి పోరాటం, త్యాగాలను వివరించారు. ఆ నాటి సాయుధ రైతాంగ పోరాటం జరిగిన తీరు, రజాకార్ల సైన్యం చేసిన దుర్మార్గపు పనులు మరియు నిజాం రాజు దేశ విద్రోహ కుయుక్తులను పసిగట్టిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఆగమేఘాల మీద నిజాం రజాకార్ల మీదికి సైనిక చర్య (ఆపరేషన్ పోలో) ఆదేశించడం, తరువాత నిజాం రాజు ఎలా లొంగిపోయాడో వివరించారు. ఈ కార్యక్రమంలో  లు  పిరమిడ్ ద్యానం మందిర నిర్వహకులు వెంకటేశ్వరరావు,యోగా గురువు  యోగా రాంబాబు,

బియంఎస్ కమలాపురం శాఖ అధ్యక్ష కార్యధర్షులు నాయకులు పాకనాటి వెంకటరెడ్డి,రామిడి సురేష్,భాజపా ములుగు జిల్లా ప్రధాన కార్యధర్షి గాజుల కృష్ణ,తాపిమేస్త్రిల సంఘ నాయకులు మన్నెం జక్రయ్య,అటోయూనియన్ నాయకులు కృష్ణారెడ్డి,అబ్బాస్ రాజు సాంబన్న,బిల్డర్ కోరుకోప్పుల శంకర్,లావుడ్యా శివ కుమార్,వైశ్య సంఘం నాయకులు తాటిపల్లి రాజేందర్, స్వయం సేవకులు గూడా యాదగిరి,బోనగిరి యాదగిరి,వకులాభరణం రఘుపతి లతో పాటు వ్యాపారాలు మరియు అనేక మంది ప్రజలు కమలాపురంలో జరిగిన ఈ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో పాల్గోన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: