CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసీల హక్కుల సాధన కోసం ఉద్యమిద్దాం.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగపేట మండలం లోని ఆదివాసి కమ్యూనిటీ హాల్ స్థలం లో ఆదివాసి జెండాను తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీల అభివృద్ధి,హక్కులు, చట్టాల అమలు కోసం ఐక్యరాజ్య సమితి ప్రతినిధుల బృందం ఆగస్ట్ 9వతేదిని ప్రపంచ ఆదివాసి దినోత్సవం గా జరుపు కోవాలని పేర్కొనడం జరిగింది అని తెలిపారు

కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదివాసీల గురించి ఏ మాత్రం పట్టించకోవడం లేదని, హక్కుల కోసం అడిగే వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించి తీవ్ర ఇబ్బందు లకి గురి చేస్తున్నారని, పాలక పక్షాల కు రానున్న ఎన్నికల్లో ఆదివాసీలు తప్పకుండా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఎప్పడి నుంచో అడుగుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం సంబంధం లేనట్టు చోద్యం చూస్తోంది అని, ఆదివాసి లు లేకపోతే అడవులు ఎప్పుడో అంతరించి పోయేవని, అడవిని కాపాడుతూ తమ పొట్టకూటి కోసం కొంత పోడు భూమిని సాగు చేసుకుంటే దానిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పదించి ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలు అందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పోదేం కృష్ణ ప్రసాద్,ఏఈ డబ్ల్యూ సిఏ జిల్లా నాయకులు తల్లడి నాగేశ్వర రావు,టీ డబ్ల్యూటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జబ్బ రవి,యుటీఎఫ్ జిల్లా నాయకులు కొండ చెంచయ్య,ఏసిటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పొదెం రవీందర్ , ఏఈడబ్ల్యూసిఏ మండల అధ్యక్షలు చింత కృష్ణ మూర్తి, ప్రధాన కార్యదర్శి మద్దెల అంజయ్య , ఆదివాసి మహిళా ఉద్యోగులు సత్యవతి,గంగ, రాంబాయి,జయమ్మ,జమున, రమాదేవి, ఆదివాసి ఉద్యోగులు మడి మల్లయ్య, కోరెం శ్రీను, మద్దెల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: