CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన ఆసరా పెన్షన్లు రిలీజ్ చేసిన తెలంగాణ ప్రభుత్వం -అశ్వరావుపేట మండలంలో ఏ గ్రామానికి ఎన్ని మంజూరు అయ్యాయి ప్రకటించిన ఎంపీపీ మరియు ఎంపీడీవో

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం అశ్వరావుపేట స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 75 వ భారత స్వాతంత్ర ద్విసప్తాహ వజ్రోత్సవ వేడుకలలో భాగంగా వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు అర్హులైన వారికి ధరఖాస్తు చేసుకున్న వారికి ఆసరా పెన్షన్లు వచ్చే నెల 15 నుండి విడుదల చేయనున్నారు. దీనికి అశ్వారావుపేట మండలం నుండి అర్హులైన వారి లిస్ట్ ను ఎంపీడీఓ విద్యాధరావుతో కలసి పరిశీలించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈ సంధర్బంగా ఎంపీపీ జల్లిపల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన మాట ప్రకారం శనివారం ఈ ఆసరా పెన్షన్లను విడుదల చేస్తున్నారని, తెరాస  ప్రభుత్వం ఎప్పుడూ పేద ప్రజలకు అండగా ఉంటుందని, రైతులకు పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, పేద పిల్లల చదువులకు గురుకులాల్లో ఒక్కో విద్యార్థికి సుమారు లక్ష రూపాయల పైనే కర్చు చేస్తుందని, తెరాస ప్రభుత్వం వచ్చాక 24 గంటల కరెంట్, ఇంటిటికి నల్ల మరీ ఏ ప్రభుత్వం చేయనంతల పారిశుధ్యం డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక ఇలా ఎన్నో అభవృద్ధి కార్యక్రమాలు చేస్తుందని ఈ సంధర్బంగా ఆయన తెలిపారు. అలాగే అశ్వారావుపేట మండలంలో మొత్తం 1512 మంది అర్హులైన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు అయ్యాయని అవీ గ్రామాల వారీగా అచ్యుతాపురం-48, అనంతరం-21, అసుపాక-78, అశ్వారావుపేట-470, బచ్చువారిగుడెం-20, దిబ్బగుడెం-38, గాండ్లగుడెం-15, గుమ్మడి వల్లి-85, గుర్రాల చెరువు-14, జమ్మిగుడెం-35, కన్నాయిగుడెం-24, కావడిగుండ్ల-20, కేశప్పగూడెం-13, కొత్త మావిళ్ళ వారిగూడెం-26, కోయరంగాపురం-16, మద్దికొండ-13, మళ్ళాయిగూడెం-28, మొద్దులమడ-5, నందిపాడు-46, నారంవారిగుడెం-80, నారంవారిగూడెం కాలనీ-16, నారయణపురం-66, ఊట్లపల్లి-33, పాత అల్లిగుడెం-3, పాత రెడ్డిగూడెం-6, పేరాయిగూడెం-117, రామన్నగూడెం-12, తిరుమల కుంట-92, వేదాంతపురం-15, వినాయక పురం-57 ఇలా మండలం మొత్తం 1512 మంది లబ్ధి దారులకు వచ్చే నెల నుంచి ఆసరా పెన్షన్ వస్తుందని అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి  తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: