CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అశ్వరావుపేటలో ముగ్గుల పోటీలు. -పోటీలో పాల్గొన్న మహిళలకు, చిన్నారులకు బహుమతులు అందజేసిన ఎంపీపీ

Share it:

మన్యం మనుగడ, అశ్వారావుపేట: 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు భారత స్వాతంత్ర ద్వీసప్తాహం వజ్రోత్సవ వేడుకలలో భాగంగా ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు స్థానిక మహిళలచే సెర్ఫ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అశ్వరావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి పాల్గొని ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్వహించే భారత స్వాతంత్ర్య ద్విప్తాహం వజ్రోత్సవ వేడుకలు కనుల పండుగల వున్నాయని, ఈ వేడుకలలో భాగంగా ప్రతీ రోజు నిర్వహించే కార్యక్రమాలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, ఈ రోజు నిర్వహించినా ఈ ముగ్గుల పోటీలలో నా తోటి అక్కాచెల్లెళ్ళు చిన్నారులు రంగులతో వేసిన రంగవల్లులను చూస్తే చాలా సంతోషంగా ఉందని, ప్రతీ ఒక్కరికీ చాలా అందంగా ముగ్గులను రంగులతో నింపి తమ ప్రతిభను చూపారని, ఈ రోజు వేసిన ముగ్గులలో ఎది మొదట బహుమతి ఇవ్వాలో కూడా చెప్పాలేనంతగా ప్రతి ఒక్కరూ పోటి పడి ముగ్గులు వేశారని, అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ముగ్గులు వేసిన ప్రతి ఒక్క మహిలకి ధన్యావాదాలు తెలిపారు. ఇదే కార్యక్రమంలో ఒక మూడూ సంవత్సరాల పాప ముగ్గు వేయటం చూసి ఆశ్చర్యంగా ఆ పాప వేసే ముగ్గుని చూసి ఆ ముగ్గుకి ప్రత్యేక బహుమతి ఇచ్చిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి. శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సర్పంచ్ అట్టం రమ్య, ఏపీఎం వెంకట్ రెడ్డి, డిటీ  సుచిత్ర, సీడీపిఓ రోజరాణి, సూపర్వైజర్ విజయలక్ష్మి, సౌజన్య, ఎల్డిసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: