CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బీజేపీ దగ్గర విషం తప్ప..విషయం లేదు:ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.

Share it:

 


మన్యం టివి వెబ్ న్యూస్:


రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి, తెలంగాణకు ఏదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలింది. బీజేపీ నేతలకు అధికార యావ,కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదు. విభజన చట్టం హామీల ఊసే లేదు.18 రాష్ట్రాల సీఎంలు వచ్చారు.తెలంగాణ కంటే ఎక్కువ ఏం చేశారో చెబుతారనుకున్నాం.బీజేపీ దగ్గర విషం తప్ప విషయం లేదు అని మరోసారి రుజువైందని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ అయ్యారు.సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మట్లాడారు. అమిత్ షా నీళ్లు,నిధులు, నియామకాల గురించి మాట్లాడారు.నీళ్లు,నిధులు నియామకాలు వచ్చాయని ఎవరిని అడిగినా చెబుతారన్నారు.ఏ జిల్లాకు అయినా వెళదాం పదండి.నీళ్లు ఎలా వచ్చాయో తెలుస్తుంది. నాతో పాటు వస్తే నీళ్లు ఎలా వచ్చాయోచూపిస్తానని అమిత్‌ షాకు సవాల్‌ విసిరారు.


నీళ్లు రాక పోతే ప్రధాని మోదీ లక్ష కోట్ల రూపాయల విలువైన ధాన్యం తెలంగాణ నుంచి ఎలా కొన్నామంటారు? పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యం పండించింది తెలంగాణే అని నీతి ఆయోగ్ లెక్కలు చెప్పిన విషయాన్ని మంత్రి హరీశ్‌ రావు గుర్తు చేశారు.2కోట్ల 60 లక్షల టన్నుల ధాన్యం నీళ్లు రాక పోతే ఎలా పండుతుందని సూటిగా ప్రశ్నించారు.


ప్రతి విషయంలో నిజాలు చెప్పలేక అమిత్ షా అభాసు పాలయ్యారన్నారు.ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి అమిత్ షా తన వ్యాఖ్యలతో తెలంగాణ రైతులను అవమానించారన్నారు.యూపీ తలసరి ఆదాయం తెలంగాణ కన్నా మూడు రెట్లు తక్కువ. సీఎం కేసీఆర్ సింగిల్ ఇంజిన్ సర్కార్ ఉన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ కన్నా ఎక్కువ ప్రగతిని సాధిస్తున్నారని ఆయన తెలిపారు.


బీజేపీ ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడరు.దమ్ముంటే 16 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో అమిత్ షా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.తెలంగాణ ఉద్యమాల గడ్డ అమిత్ షా ఏదో చెబితే నమ్మడానికి సిద్ధంగా ఎవరూ లేరన్నారు.మహిళల గురించి ఏదో గొప్పగా మోదీ మాట్లాడారు.మహిళకు కన్నీళ్లు తెప్పిస్తున్న సిలిండర్ ధర పెంచిన విషయం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.


ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని అన్యాయంగా మాట్లాడుతున్నారు.కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులిచ్చి రూ.80 వేల కోట్ల రుణానికి ఆమోదించింది కేంద్రం కాదా? పార్లమెంట్ సాక్షిగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదని కేంద్రమంత్రి చెప్పలేదా? అని ప్రశ్నించారు.


తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పై నిన్న కూడా అమిత్ షా విషం కక్కారని మండిపడ్డారు. తెలంగాణ మీద ప్రేముంటే బీజేపీ విభజన చట్టం హామీలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్ అంకిత భావం వల్లే తెలంగాణ అభివృద్ధిలో దూసుకు పోతుందన్నారు.

Share it:

TS

Post A Comment: