CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భారీ వర్షానికి కూలిన ఇల్లు: సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబం.

Share it:


 మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం,పాత మామిళ్లవారి గూడెం పంచాయతీలో గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు అదే గ్రామంలో నివాసం ఉంటున్న యగ్గడి సమ్మయ్య, భార్య యగ్గడి సత్యవతి దంపతులు నివసిస్తున్న అటువంటి వారు నిర్మించుకున్న మట్టితో కూడిన తాటాకు ఇల్లు అకాల వర్షాలకు బాగా తడిసిపోయి ఒక పక్క గోడ కూలిపోయింది, ఈ అకాల వర్షాలు ఇలాగే కొనసాగితే ఇల్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది సమ్మయ్యది ఒక నిరుపేద సామాన్య రైతు కూలీ కుటుంబం ప్రతిరోజు రెక్కాడితే గాని డొక్కాడని పేదరిక పరిస్థితి సమ్మయ్యది ప్రతిరోజు ఏదో ఒక కూలి పనికి వెళితేనే తప్ప ఇంట్లో పూట కూడా గడవని వైనం ఇటువంటి పరిస్థితుల్లో ఈ వర్షాల కారణంగా ఇప్పుడు తన ఉంటున్నటువంటి తను నిర్మించుకున్నటువంటి ఆ ఇల్లు ఒకపక్క గోడ కూలిపోయింది ఇంకా ఈ వర్షాలు ఇలాగే కొనసాగితే పూర్తి ఇల్లు కూడా కూలిపోయి నిలువ నీడ కూడా లేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతు ఆవేదన వ్యక్తపరిచారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: