CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వరదల సమయంలో సర్పంచ్ సేవలకు వందనం..

Share it:


మన్యం టీవీ దుమ్ముగూడెం ::

వరదల సమయంలో పర్ణశాల సర్పంచ్ వరలక్ష్మి  అందించిన సేవలు మరువలేనివని, ఆమె సేవలకు వందనాలు తెలియజేస్తూ పర్ణశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మాన గ్రహీత పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మిని ఘనంగా సన్మానించారు. గోదావరి వరదలు పొంగిన సమయంలో పంచాయతీ ప్రజలకు అండగా నేను ఉన్నాను అంటూ ముంపు వాసులకు ఆమె భరోసాను అందిస్తూ సురక్షితంగా పునరాస కేంద్రాలకు తరలించారు. పంచాయతీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా పునరాస కేంద్రాల వద్ద రుచికరమైన భోజనాలు, మౌలిక వసతుల సౌకర్యం కల్పించి అండ దండగా ఉన్నారు. వరదల అనంతరం ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించి ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా అడుగులు వేశారు. వరద బాధిత కుటుంబానికి నిత్యవసరాలు అందేలా తగు చర్యలు తీసుకున్నారు. ఆమె అందించిన సేవలకు  గాను గుర్తింపుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది ఆమెను సాల్వతో ఘనంగా సన్మానించి పూలమాలలతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా ఉపసర్పంచ్ వాగే ఖాదర్ బాబా, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి లను కూడా ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ చాట్ల సింహాచలం రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: