మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం తాహశీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు తలపెట్టిన నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన బిఎస్పి జిల్లా అధ్యక్షులు మడకం ప్రసాద్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏ, డిమాండ్ లు అన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, వారికి వేతనాలు పెంచాలని, వీఆర్ఏ ల పే స్కేలు అమలు చేయాలి, అర్హత కలిగినటువంటి వీఆర్ఏలకు పదోన్నతి ఇవ్వాలని, 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం ఇస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మడకం ప్రసాద్ దొర అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ జున్ను రవి, ఫిట్ ఇండియా ఫౌండేషన్ అధ్యక్షులు తగరం రామ్ నివాస్, బీఎస్పీ అశ్వారావుపేట మండలం ఇంచార్జ్ రాయల పోలయ్య, యూత్ లీడర్ ప్రకాష్, సుహాసిని, కుమారి, స్వాతి, తిరుపతమ్మ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: