CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్థానిక ఆదివాసీ విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించండి: దమ్మపేట మండల ఆదివాసీ జేఏసీ .

Share it:

 


దమ్మపేట జులై 02 ( మన్యం మనుగడ ) : శనివారం నాడు దమ్మపేటలోని టి.యస్.టి.డబ్లు రెసిడెన్సీయల్ కళాశాల & పాఠశాలను మండల ఆదివాసీ జేఏసీ బృందం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అశ్వారావుపేట, దమ్మపేట,ములకలపల్లి,చండ్రుగొండ ,మండలాల్లో ఆదివాసీ విద్యార్థులు అధికంగా ఉన్నారు వీరు ఇప్పుడిప్పుడే ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు కానీ వీరి కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిన కారణంగా దూర ప్రాంతాలకు వెళ్లి విద్యాను అభ్యసించలేకపోవుచున్నారు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని త్వరలో జరగనున్న కౌన్సెలింగ్ లో ఆదివాసీ విద్యార్థులకు 80% సీట్లు కేటాయించి ఆదివాసీ విద్యార్థుల అభివృద్ధికై కృషి చేయాలని ప్రిన్సిపాల్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, తాటి పోతురాజు, పర్శిక మారేశ్, సోయం రామ్మూర్తి, వాసం వెంకటేశ్వరరావు, మడకం ప్రసాద్, వాడే వీరాస్వామి, వంకా వరాలబాబు, ప్రశాంత్, కుంజా చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: