CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ పౌండేషన్ భద్రాద్రి జిల్లా కమిటీ అధ్యక్షులు వేముల భారతిఆదేశాల మేరకు ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు.

Share it:


మన్యం మనుగడ, అశ్వారావుపేట:దిశ ప్రొటెక్షన్ & వెల్పేర్ పౌండేషన్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలొ వితరణ, ముంపు ప్రాంత ప్రజలకు దిశ ఆపన్నహస్తం, సేవ దుక్ప్రదాన్ని చాటుకున్న దిశ కమిటీ సభ్యులు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలు జలమయమయ్యాయి. ఎంతో మంది నిరాశ్రులయ్యారు. ఈ నేపథ్యంలో ముంపునకు గురైన వరద భాదితులకు దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ పౌండేషన్ భద్రాద్రి జిల్లా కమిటీ అధ్యక్షులు వేముల భారతి ఆదేశాల మేరకు గోదావరి పరివాహక ప్రాంతాలు ఐనా భద్రాచలం మరియు పర్ణశాల చుట్టూ పక్కన గల చిన్న చిన్న గిరిజన గ్రామాలలొ మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం, అశ్వాపురం, చర్ల, సారపాక, పట్టణ ప్రాంతాలలో దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ పౌండేషన్ దిశ సభ్యులు గత కొన్ని రోజులుగా ముంపు ప్రాంత ప్రజలకు తమవంతు సాయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్టు దిశ సభ్యులు తెలిపారు. అదే విధంగా సోమవారం భద్రాచలం లో పలు ప్రాంతాలలో వున్న బాధితులకు 250 మందికి రైస్ మరియు పప్పు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ పౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు వేముల భారతి, ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాలలో చిక్కుకున్న వారెవరూ ఆహారం, నిత్యావసరాలు అందక బాధపడకూడదని, అవకాశమున్నవారంతా బాధితులను ఆదుకోవాలని ఇచ్చిన పిలుపు మేరకు తనవంతు సహాయం చేస్తున్నట్లు దిశ సభ్యులు తెలిపారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లోనూ వరదల్లో చిక్కుకున్న పేదవారికి చేత నైన సహాయం చేయడం తన కర్తవ్యంగా భావిస్తున్నట్లు వివరించారు. సామాజిక సేవ చేయడం తమకెంతో ఆనందాన్నిస్తుందన్నారు. ఈ సందర్భంగా వరద బాధితులు మాట్లాడుతూ జోరువానలో సహాయక చర్యల్లో పాల్గొని బాధల్లో ఉన్న తమకు అండగా నిలబడిన దిశ సభ్యులు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇటుకల మాధవి, ఎస్కె ఆరిఫా, పూజల లక్ష్మి, రాగాల కుసుమ, ఈ లక్ష్మి తదిరరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: