CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు..

Share it:

జూలూరుపాడు జూలై 25, (మన్యం మనుగడ) ప్రతినిధి, మండల కేంద్రంలోని ఆర్కె ఫంక్షన్ హాల్ లో సోమవారం కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను  పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో బంజారా సాంప్రదాయంలో ఘన స్వాగతం పలికి, భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జూలూరుపాడు కు చెందిన చాపలమడుగు నరసింహారావు ఆధ్వర్యంలో సుమారు 400 మంది వివిధ పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని కాంగ్రెస్ పార్టీ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్ మాలోతు రాందాస్ నాయక్, డిసిసి అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు లు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగు చెంది ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మంగీలాల్ నాయక్, సీనియర్ నాయకులు ముత్తినేని రామయ్య, మంద బాబు, నున్న కృష్ణయ్య, బొడ్డు బాబు, కిషన్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: