CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

13 వేల కుటుంబాలు... రూ.1,04,04,000(ఒక కోటి4లక్షల 4వేలు)నిత్యావసర సరుకుల పంపిణీ

Share it:

 



మన్యం మనుగడ, కరకగూడెం:

గోదావరి ముంపు ప్రాంత ప్రజలకు బియ్యంతో పాటుగా నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన టిఅర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు.

 ఏజెన్సీ లో నివసిస్తున్న అడవి బిడ్డలు రేపు అర్బన్ బిడ్డలుగా చూడాలి:రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి



కుటుంబంలో ఒక తండ్రి తన పిల్లలను ఎలా చేసుకోవాలో మీ ఎమ్మెల్యేగా రేగా కాంతారావు వరద బాధితులను అలా చుసుకుంటున్నారు:ఎంపీ మాలోత్ కవిత

ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుంది ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం మనుగడ కరకగూడెం:గత పదిహేను రోజుల క్రితం కురిసిన బారి వర్షాలకు సర్వం కోల్పోయిన గోదావరి ముంపు వరద బాధిత కుటుంబాలు నూతనంగా ఎన్నికైన రాజ్య సభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు,రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులతో కలిసి పినపాక నియోజకవర్గం లోని పినపాక, మణుగూరు, అశ్వపూరం,బూర్గంపాడు మండలాల వరద బాధితులకు 13 వేల కుటుంబాలు... రూ.1,04,04,000(ఒక కోటి4లక్షల 4వేలు)నిత్యావసర సరుకుల పంపిణీ నిత్యావసర వస్తువులతోవపాటు బియ్యం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలకు అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ ముంపు ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు,గోదావరి వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగాదుకుంటుందని వారు అన్నారు, సీఎం కేసీఆర్ గారు వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ రోడ్డు మార్గాన వందలాది కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి గోదావరి వరద బాధితులను పరామర్శించార అన్నారు.గోదావరి వరద బాధిత కుటుంబాలకు అపద్భాందువుడు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి అని అన్నారు. అడిగిన వెంటనే కోటి ఒక్కలక్ష నలబై వేయిల రూపాయలు వరద బధితులకు దేవుని రూపంలో వచ్చి సహాయం ఇచ్చిన మహనీయులు వారికి మా నియోజకవర్గం ప్రజాల తరుపున సిరసువంచి ధన్యవాదములు తెలుపుతున్నానని అన్నారు.అలాగే 1000 కోట్లతో ఎత్తయిన ప్రదేశంలో కాల నీలు నిర్మించి, ఇస్తారని చెప్పడం అభినందనీయమని అన్నారు. ముంపుకు గురైన ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం కుటుంబానికి రెండు నెలల పాటు 25 కిలోల బియ్యం ఇవ్వడం జరుగుతున్నది అన్నారు. అదేవిధంగా నెల్లిపాక బంజార గ్రామ వద్ద ఇటీవల భారీ వర్షాలు కురవడం వల్ల దెబ్బతిన్న రహదారిలను పరిశీలించడం జరిగింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న అన్నారు.దేశంలో ఎక్కడా లేనటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని వారు తెలిపారు.అనంతరం వరద బాధితులకు ఆర్థిక సహాయం చెయ్యటం కొసం వచ్చిన అపద్భాందవుడు బండి.పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం గ్రామాలు అభివృద్ధికి కోసం నేటి టిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపెట్ట వేస్తున్నారన్నారు.అలాగే నేను మొట్టమొదటి సారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తరువాత నా స్వంత గ్రామనికి కర్చు పెట్టాలి అనుకున్న రూపాయ అదేవుడు,భద్రాచలం శ్రీరాముడు గోదావరి వరద బాధిత కుటుంబాలకు సహాయం అందించేలా చెశారు అన్నారు.అలాగే ఏజెన్సీ గ్రామాలలో నివసిస్తున్నా అడవి బిడ్డలు రేపు అర్బన్‌ బిడ్డలుగా ఎదాగలని అన్నారు. మీ పిల్లలు ఉన్నత స్థాయిగా చదివించలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర,(గాయత్రి రవి) మాలోత్ కవిత ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు, అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చ. నాగేశ్వరరావు, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య , పాలేరు శాసనసభ్యులు కందాల. ఉపేందర్ రెడ్డి , వైరా శాసనసభ్యులు లావుడ్యా రాముల నాయక్, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , ఖమ్మం జిల్లా జడ్పీ చైర్పర్సన్ లింగాల కమల్ రాజు , జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్ , కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి,అధికారులు, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: