మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం లోని రాజుపేట 6వ,అంగన్వాడీ కేంద్రానికి ఇంతవరకు శాశ్వత భవనం లేదు, అంగన్వాడీ భవనం కోసం ఎన్ని సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసిన స్థలం ఉంటే భవనం మంజూరు చేస్తాము అంటున్నారు. గ్రామ పంచాయతీ తరపున పల్లె ప్రగతి లో భాగంగా ఎక్కడైనా స్థలం కేటాయించాలి, ఎవరైనా రాజుపేట గ్రామస్తులు దాతలు ఉంటే ముందుకు వచ్చి అంగన్వాడీ కోసం స్థలం ఇవ్వాలని లేదా ముత్యాలమ్మ గుడి ప్రక్కన ఉన్న స్థలం అంగన్వాడీ భవనం కోసం కేటాయించాలి, అంగన్వాడీ భవనం కోసం స్థలం గ్రామ పంచాయతీ నిధులు పల్లె ప్రగతి లో భాగంగా కేటాయించి స్థలం కొనుగోలు చేసి శాశ్వత భవనం మంజూరు అయ్యేలా సహకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.ఈ విషయం పై అంగన్వాడీ టీచర్, హెల్పర్ స్పందిస్తూ శాశ్వత భవనం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, అద్దెకు రూమ్ లు దొరకడం లేదు రూమ్ ఉన్న గవర్నమెంట్ వారు చెల్లించే అద్దెలకు యజమానులు రూమ్ లు ఇవ్వటానికి నిరకరిస్తున్నారు, అద్దె నెల నెల చెల్లించాలని షరతులు పెడుతున్నారు అందువలన గ్పల్లె ప్రగతి లో భాగంగా అంగన్వాడీ ప్రీ స్కూల్ పిల్లలు, బాలింతలు గర్భిణీ స్త్రీలు,లబ్ధిదారుల శ్రేయస్సు కోరి స్థలం కేటాయించి భవనం నిర్మించాలని ఈ సందర్బంగా కోరారు.
Post A Comment: