CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పలు ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించండి, గిరిజన ప్రాంతాలకు బస్సు ఎంతో అవసరం -సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, గొడవర్తి వెంకటేశ్వరరావు..

Share it:


మన్యం మనుగడ, అశ్వరావుపేట: అశ్వారావుపేట నియోజవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సూచనలు, ప్రజల కోరిక మేరకు పలు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని కోరుతూ బస్సు రూట్ వివరాలను డిపో మేనేజర్ కు అందజేయడం జరిగిందని అశ్వరావుపేట నియోజవర్గ సీనియర్ నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి గొడవర్తి వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం నాడు సత్తుపల్లి బస్ డిపో కార్యాలయం నందు ఆర్టీసీ మేనేజర్ కు ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ నందు వివరాలతో దరఖాస్తు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలు ప్రాంతాల ప్రజలు అనగా ఊట్లపల్లి, వినాయకపురం, ఆసుపాక, నారాయణపురం, గాండ్ల గూడెం, గుమ్మడవల్లి, కొత్తూరు మీదగా వేలేరుపాడు, రుద్రంకోట వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక ప్రజలు కోరగా ఎమ్మెల్యే సూచనలతో దరఖాస్తులు డిపో మేజర్ కు అందజేయడం జరిగిందని, పరిసర ప్రాంతాలను పరిశీల చేసి బస్సు సౌకర్యం కల్పించుటకు సాధ్యసాధ్యాలను పరిశీల చేయడం జరుగుతుందని డిపో మేనేజర్ చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజలకు రవాణా సౌకర్యార్థం పెద్ద వాగు ప్రాజెక్టు నందు మహిళా డిగ్రీ కళాశాల రావడం సుధీర ప్రాంతాల నుండి రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి, ఎమ్మెల్యే చొరవ చూపి బస్సు సౌకర్యం కోసం మేనేజర్ ను సంప్రదించడం శుభ పరిణామం అని వారన్నారు. సానుకూలంగా స్పందించి మేనేజర్ త్వరలోనే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయటం జరుగుతుందని ప్రజలందరూ సద్విని పరుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల కోరికలను తీర్చే విషయంలో ఏమాత్రం అలసత్వం చూపకుండా ఎమ్మెల్యే కృషి అభినందనీయమని వారన్నారు. అలాగే స్థానిక అశ్వారావుపేట బస్ స్టేషన్ నుండి విజయవాడకు ఉదయం 6 గంటలకు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని అన్నారు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారం చూపడం కోసం ఎమ్మెల్యే చూస్తున్న కృషి పట్టుదల ఎంతో గొప్ప వని, ప్రజలంతా అర్థం చేసుకొని సహాయ సహకారాలు అందించాలని కోరారు.

Share it:

TS

Post A Comment: