CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మన ఊరి మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ జలిపల్లి శ్రీరామమూర్తి.

Share it:



మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, పేరాయిగూడెం గ్రామ పంచాయతీ, నెహ్రునగర్ కాలనీలో మరియు అశ్వారావుపేట మేజర్ గ్రామ పంచాయతిలో దొంతికుంటలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మన ఊరు మన బడి కార్యక్రమంలో సెలెక్ట్ అయిన సందర్భంగా బుధవారం రోజు పాఠశాలలో "మన ఊరు మనబడి" కార్యక్రమం పనులను అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీరామమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెహ్రూ నగర్ పాఠశాలకు 5.85 లక్షలు, దొంతికుంట పాఠశాలకు 22 లక్షల నిధులు మంజూరు అయ్యాయని, టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్క విద్యార్ధి మంచి విద్యతో ఉన్నత స్థానానికి చేరాలనే భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని దానికోసం వేల కోట్ల నిధులను ఖర్చు చేస్తుందన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాలకమిటీ వారిని తాము కోరుతున్నట్లు తెలిపారు. అలాగే త్వరగాతిన పనులనూ నాణ్యతతో చేసి ఇచ్చిన సమయంలో త్వరగా పూర్తి చేయాలని సంబధిత కాంట్రాక్టర్ కు తెలిపారు. గ్రామస్తులు ఉపాధ్యాయులు,కమిటీ వారు కలిసి పనిచేసి ఈ పాఠశాలను కార్పెరెట్ పాఠశాలల కంటే కూడా మెరుగ్గా తయారు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుమతి ఉపసర్పంచ్ జగన్నాథం, ఎంపిటిసి వేముల భారతి, బండారి శ్రీను, నార్లపాటి రాములు, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, బాబురావు పాఠశాల చైర్మన్ మధు, నాగమణి, పార్వతి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: