CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఖరీఫ్ సీజన్ లో రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు,వడ్డీలేని రుణాలు అందించాలి.

Share it:



  • సిపిఐ (ఎం ఎల్ )ప్రజాపంథా,అఖిల భారత రైతు కూలీ సంఘం(ఎఐకెఎంఎస్) డిమాండ్

ములకలపల్లి(జూన్ 16) మన్యం మనుగడ ప్రతినిధి :

సీపీఐ ఎంఎల్-ప్రజాపంథా,అఖిల భారత రైతు కూలి సంఘం(ఎఐకెఎంఎస్) ములకలపల్లి మండల కమిటీల ఆధ్వర్యంలో రైతాంగానికి సరిపడ విత్తనాలు,ఎరువులు,ఉచితంగ ఇవ్వాలని,ఒకేసారి లక్షరూపాల రుణమాపీ చేయాలనే డమాండ్స్ తో ములకలపల్లిలో ప్రదర్శన.తహాశీల్దార్ కార్యలయం ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది

ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం(ఎఐకెఎంఎస్) రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ,పాలకుల తప్పుడు విధానాల వలన,సాగుకు ప్రభుత్వ సాయం విడనాడినందున వడ్డీ వ్యాపారులు,కల్తి విత్తన వ్యాపారులు గ్రామాల్లో మధ్యవర్తుల ద్వార కల్తి విత్తనాలు,ఎరువులు అమాయక రైతులకు అంటగట్టి పిండుకోటానికి సిద్దపడ్డారని,అయినా ప్రభుత్వ అధికార్లు కొన్ని చర్యలు,దాడులతో చేతులు దులుపుకొంటున్నారని,పూర్తి స్థాయిలో నేరస్తులను అరికట్టలేక పోతున్నారని అన్నారు.అందుకనే సమగ్ర కేంద్ర చట్టం తేవాలని,రైతాంగ రక్షణకు పూనుకోవాలన్నారు.

అదేవిదంగా రాష్ట్ర రైతాంగానికి ముఖ్యంగా కౌలు,సన్న చిన్నకారు రైతులకు ప్రత్తి,మిర్చి విత్తనాలతో సహా అవసరమైన అన్ని విత్తనాలు ప్రభుత్వం ఉచితంగా అందించాలని,వ్యవసాయ పరికరాలు,యంత్రాలు సబ్సీడీలతో రైతులకు ఇవ్వాలని.కల్తీ విత్తన వ్యాపారాన్ని అరికట్టాలని.నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని.సమగ్ర చట్టం చేయాలని,ఖరీఫ్ సీజన్ కు రైతులకు అవసరమైన వడ్డీలేని రుణాలు ఇవ్వాలని,అన్ని పంటలకు ఈ సంవత్సరం అయిన పెట్టుబడి ఖర్చులన్నిటిని లెక్కించి స్వామినాథన్ కమీషన్ సిఫారసులకు ప్రకారం అనగా సీ2+50% ప్రకారం ఎం.ఎస్.పి. నిర్ణయించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని.ధరలు పంటలకు ముందుగానే ప్రకటించాలని ఆయన ప్రభుత్వన్ని డిమాండ్ చేసారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతుకూలీ సంఘం(ఎఐకెఎంఎస్) జిల్లా అద్యక్షులు ముద్దా బిక్షం,ప్రజాపంథా జిల్లా నాయకులు నూపా భాస్కర్,కల్లూరి కిషోర్,పోతుగంటి లక్ష్మణ్,మండల నాయకులు యర్రగొర్ల రామారావు,రాచన్నగూడెం సర్పంచ్ కొర్సా గణపతి,ఎంపీటీసీ లు నూపా సరోజని,మడకం విజయ, రాచన్నగూడెం ఉప సర్పంచ్ వగ్గెల వెంకటేష్,పివైఎల్ డివిజన్ కార్యదర్శి కొర్సా రామకృష్ణ,ఈసం విజయ్,తదితరులు పాల్గోన్నారు.

Share it:

TS

Post A Comment: