CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విలువైన టేకు కలప నిల్వలను పట్టుకున్న అటవీశాఖ సిబ్బంది.

Share it:

 



మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 4 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వృక్ష సంపదలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, విలువను, గుర్తింపును సంపాదించుకున్న టేకు చెట్టు కలపకు ప్రస్తుతం ఎంత విలువ ఉందో మనందరికీ తెలుసు, మరి అంతటి విలువైన టేకు కలప నిల్వలను చాకచక్యంగా జూలూరుపాడు అటవీశాఖ సిబ్బంది పట్టుకున్న సంఘటన శనివారం తెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే మండల పరిధిలోని బేతాళపాడు గ్రామంలో టేకు కలప నిల్వలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు జూలూరుపాడు ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్ రావు తన సిబ్బందితో కలిసి గ్రామంలోని తొండెపు సత్యనారాయణ అనే రైతు ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 4 లక్షల రూపాయల విలువైన టేకు కలప దుంగలను పట్టుకున్నారు. అనంతరం సదరు వ్యక్తిని పిలిపించి వివరణ కోరగా, తమకు ఉన్న వ్యవసాయ పట్టా భూమి గట్లపై గత 20 ఏళ్ల క్రితం టేకు మొక్కలను పెంచామని, ఈ మధ్య కొందరు మాకు తెలియకుండా టేకు చెట్లను దొంగిలిస్తున్న సందర్భంలో తాము పెంచిన చెట్లను నరికించి ఇంట్లో నిల్వ ఉంచినట్లు తెలిపారని అన్నారు. రైతు చెప్పిన విషయమై విచారణ కొరకు వారి వ్యవసాయ భూమి గట్ల ను సందర్శించి గట్లపై ఉన్న టేకు చెట్ల మొదలు భాగాలను కొలతలు తీసుకుని, వారి ఇంటి వద్ద ఉన్న దుంగల భాగాల కొలతలను తీసుకొని పై అధికారులకు నివేదిక పంపుతామని తెలిపారు. చెట్లు తమ సొంత వైన కటింగ్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉందని అన్నారు. కటింగ్ పర్మిషన్ లేనందున పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Share it:

TS

Post A Comment: