CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తుడుం దెబ్బ ఆదివాసి మహిళ రాష్ట్ర కమిటీ ఎన్నిక.జులై చివరి వారంలో ఆదిలాబాద్ జిల్లా నాగోబా లో మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అనుబంధ సంఘం అయిన ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం శ్రీ సమ్మక్క-సారలమ్మ మేడారం లో తుడుం దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర కమిటీ 2012 నుండి 10 సంవత్సరాల కాలం పాటు కొనసాగిన క్రమంలో మళ్లీ నూతన కమిటీని వేసి భవిష్యత్ ఉద్యమ కార్యచరణ చేయాలని నిర్వహణ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యమ బలోపేతంపై తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శులు ముక్తి రాజు,సిద్దబోయిన లక్ష్మీనారాయణ, కార్యదర్శులు కోడెం వెంకటేశ్వర్లు, పొడెం బాబు,రాష్ట్ర ప్రచార కార్యదర్శి అల్లెం కోటి,లు ఎన్నికల పరిశీలకులుగా హాజరయ్యారు. అనంతరం ఆదివాసి మహిళా సంఘం భవిష్యత్ ఉద్యమ కార్యచరణ ఆదివాసి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు,లైంగిక వేధింపులు ఆదివాసి విద్యార్థినులపై అత్యాచారాలు లతో పాటు అనేక సమస్యలకు సంఘం అండగా ఉండాలని తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. అనంతరం నూతన రాష్ట్ర కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.రాష్ట్ర కన్వీనర్ గా గంట మోరి, భాగ్యలక్ష్మి, కో కన్వీనర్లుగా వట్టం సుభద్ర, బంధం స్వరూప, కొప్పుల సరిత, పేదూరు పుష్ప రాణి, ఉయిక కృష్ణవేణి, దొడ్డ అరుణకుమారి,సున్నం భవాని, ఈసం సరిత లను ఎన్నిక చేయడం జరిగిందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా చిన్న తెగలకు ప్రాతినిధ్యం ఇస్తూ రాష్ట్ర అధ్యక్ష పదవి నాయకపోడు మహిళకు ఇచ్చినట్టు రాష్ట్ర కమిటీ తెలిపింది.గత పది సంవత్సరాలు కష్టపడి ఉద్యమాన్ని నడిపిన ఇరుప విజయకు మహిళా సంఘం రాష్ట్ర చైర్మన్ గా, ఆత్రం సుగుణ కు కో చైర్మన్ గా ఎన్నిక చేసినట్లు రాష్ట్ర కమిటీ తెలిపింది. సమ్మక్క-సారలమ్మ స్ఫూర్తితో రాణి దుర్గావతి స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించాలని రాష్ట్ర కమిటీ సూచించింది.జూలై నెల చివరి వారంలో ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర మహా సభలు ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా ఆలయ సంకాడి లో అన్ని జిల్లాల ఆదివాసీ మహిళల తో నిర్వహణ చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.ఈ లోపు అన్ని జిల్లాల కమిటీలను పునర్నిర్మించాలని తెలిపింది. ఈ సమావేశంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ని బెల్లి గణేష్, ఉపాధ్యక్షులు ఆలం నగేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి ప్రకాష్,తుడుందెబ్బ నాయకులు ఆదివాసి మహిళలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: